మంత్రి కొడాలి నాని
ఉప ఎన్నికలో ఘోర ఓటమి చవిచూసినా బీజేపీ తీరుమారలేదని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..తిరుపతి, బద్వేల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదని. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ చిత్తుగా ఓడిపోయిందని ఆయన అన్నారు. ఇలా ఓడిపోయింది కాబట్టే పెట్రో, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించిందని అన్నారు. కేంద్రం పెట్రోల్‌పై రూ.40 పెంచి ఐదు రూపాయలు తగ్గించిందని, ఏదో ఘన కార్యం చేసినట్లు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని అన్నారు. క్రూడాయిల్ రేట్లు తగ్గినా.. పెట్రోల్ ధరను మోదీ పెంచారని అన్నారు. 70 రూపాయలు ఉన్న పెట్రోల్ ధరను రూ. 110కి పెంచారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు పేదల రక్తం పీలుస్తున్నారని, రూ. 5 తగ్గించి ప్రజలకు ఏదో మేలు చేశామంటున్నారని మండిపడ్డారు.‘‘బీజేపీ అరాచకాల పార్టీ.. కులమతాలు రెచ్చగొట్టే పార్టీ. ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావట్లేదంటే ఎందుకో ఆలోచించాలి. పెట్రోల్ ధరల ప్రభావం బీజేపీపై పడిరది. బీజేపీ నేతలు ఇంకా భ్రమల్లోనే ఉన్నారు.’ అని అన్నారు. చంద్రబాబు జీవితమంతా మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లు అని అన్నారు. పెట్రోల్ బంకులపై దాడులు చేసేందుకు చంద్రబాబు నిరసన దీక్ష చేపట్టారని అన్నారు. ఎన్నికల్లో టీడీపీని ప్రజలు పెట్రోల్ పోసి తగులబెట్టారని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఢల్లీిలో ధర్నా చేయాలన్నారు. నాడు పెట్రోల్, డీజిల్‌పై సర్‌చార్జి విధించింది చంద్రబాబు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేసినా జగన్‌ను ఏమీ చేయలేరని అన్నారు.