మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి.
విశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి అర్బన్ హెల్త్ సెంటర్ టెక్నీషియన్ మల్లేష్, ఉపాధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎల్సికేపురంలో గల అర్బన్ హెల్త్ సెంటర్లో 50 మంది గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తల్లం నారాయణమూర్తి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి విరాళంగా అందజేయడం జరిగిందని తెలిపారు. దాతల సహాయ సహకారాలతోనే ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా డాక్టర్ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ, ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారము తీసుకొని, ప్రశాంతమైన జీవనమును కొనసాగించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవం చేసుకోవాలని, అక్కడే సుఖ ప్రసవం జరుగుతుందని తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బందితోపాటు కార్యదర్శి మంజునాథ్, ఉప కార్యదర్శి రామకృష్ణ, డైరెక్టర్లు మనోహర్ గుప్తా, జగ్గా నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.