విశాలాంధ్ర – ధర్మవరం : మండల పరిధిలోని గొట్లురు గ్రామంలో గల అనాధశ్రమంలో రాష్ట్ర ఎన్ టి ఎఫ్ యువజన అధ్యక్షులు ఎర్రగుంట రాజా ఆధ్వర్యంలో తమ నాయకుడు మానుపాటి నవీన్ జన్మదిన వేడుకలను ఆశ్రమంలో నిర్వహించారు. తదుపరి కేకు కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం అనాధాశ్రమం ఖర్చుల నిమిత్తం ఐదువేల రూపాయల విరాళాన్ని కూడా వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, ధర్మవరం కార్యదర్శి నాగార్జున, ఈశ్వరయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.