Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

జూనియర్ డాక్టర్లు చేస్తున్న దీక్షలకు సిపిఐ పార్టీ పూర్తి మద్దతు

సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్

విశాలాంధ్ర- అనంతపురం : కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం చేయడం దుర్మార్గమైన ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి నిరసనలకు సిపిఐ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు జిల్లా సిపిఐ కార్యదర్శి జాఫర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేస్తున్నప్పటికీ కోల్కతా రాష్ట్ర ప్రభుత్వం , బిజెపి కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు అని తెలిపారు. మహిళా ముఖ్యమంత్రి ఉన్నచోట ఇలాంటి ఘటన జరగడం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాటల పైన కూడా నమ్మకం కలగడం లేదన్నారు. వారం రోజులలో లోపల హత్యాచారానికి పాల్పడినటువంటి వారిని ఉరిశిక్ష వేయడానికి కూడా వెనకాడను అని చెప్పిన మహిమతా బెనర్జీ మాటలు డాక్టర్లు నమ్మడం లేదన్నారు. అందుకే జూనియర్ డాక్టర్లు ఆందోళన ఉధృతం చేయడం జరిగింది. హైకోర్టు వెంటనే స్పందించి ఈ కేసును సిబిఐకి అప్పగించడం భద్రతా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం కొంత ఊరట కలిగించినప్పటికీ దోషులను, దోషుల వెనుకున్న కుట్ర దారులను పట్టుకోవడంలో శిక్షించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతూ ఉందన్నారు. జూనియర్ డాక్టర్లు అనంతపురము మెడికల్ కాలేజ్ నందు దీక్షలకు కూర్చోవడం ఆందోళన కలిగిస్తున్నది అన్నారు. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. 36 గంటలు సేవలు చేసి సేద తీరుతున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం చేయడం దుర్మార్గమైన సంఘటన అని పేర్కొన్నారు. మానవ మృగాలు బరితెగించి అత్యాచారాలు హత్యల కు పాల్పడుతుంటే మైకుల ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రగల్బాల పలకడం సిగ్గుచేటు అన్నారు . తక్షణం జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతును భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ . డాక్టర్లకు రక్షణ కల్పించే లేకపోతే వారి డిమాండ్ల పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని కోల్కతా రాష్ట్ర ప్రభుత్వాము, బిజెపి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img