Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

రియల్ ఎస్టేట్ దారులకు, భూ కబ్జా మాఫియాకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వ అధికారులను బర్తరఫ్ చేయాలి….

– భారత కమ్యునిస్టు పార్టీ, అనుబంధ ప్రజా మహిళా సంఘాలు డిమాండ్ ….

– పేదల నివాసాలు కూల్చి, కుటుంబాలను రోడ్ల పాల్జేస్తున్న అధికారులు …

– దర్జాగా కబ్జా చేస్తున్న పెద్దలపై చర్యలు తీసుకోవడం చేతగాక …

– అధికారుల దుశ్చర్యలు పై మండిపడ్డ సి.పి.ఐ., మహిళా సంఘాలు…

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.27.08.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాలకు పాల్పడే వారికి వత్తాసు పలుకుతూ, వారిచ్చే లంచాలకు కక్కుర్తి పడుతూ పేదలు, బడుగు బలహీనవర్గాల ప్రజలను తీవ్ర భయ బ్రాంతులకు, నిలువు దోపిడీ చేస్తున్న పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ అధికారులను తక్షణమే బర్తరఫ్ చేయాలని భారత కమ్యునిస్టు పార్టీ, అనుబంధ ప్రజా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ, పంచాయతీ స్థలాలను, రోడ్లు, డ్రైనేజీలు, పాత చెరువును దర్జాగా కబ్జా చేసిన బడాబాబుల పై ఎటువంటి చర్యలు తీసుకోలేని అధికారులు కళ్ళు పేదల నివాసాలు పై పడ్డాయని భారత కమ్యునిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏ.పి. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపిస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలు పేదలపై మంగళవారం ఉదయం “ఆక్రమణలు పై చర్యలు” అంటూ పంజా విసిరిన పంచాయతీ, పోలీస్ అధికారులు పై బాధిత కుటుంబాలు, సి.పి.ఐ. నేత రెడ్డిపల్లి, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రెడ్డిపల్లి మాట్లాడుతూ మాజీ ఉప సర్పంచ్ మారిశెట్టి సాగర్ ప్రోత్సాహంతో పంచాయతీ ఈ.ఓ. నారాయణరావు, పోలీసులు పేదలు నివాసాలపై దౌర్జన్యం చేయడం అన్యాయమన్నారు. పంచాయతీ, రెవెన్యూ అధికారులకు, అధికార ప్రజా ప్రతినిధులకు దమ్ముంటే చోడవరం లో కబ్జాలకు పాల్పడ్డ బడాబాబులు పై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చోడవరం మేజర్ పంచాయతీ లో సుమారు 280 పైగా పంచాయతీ స్థలాలు కబ్జా కు గురయ్యాయని తెలిపారు. అధికార, ప్రతిపక్ష నేతలు అండదండలతో రెవెన్యూ సర్వే నెంబరు.82లో ప్రధాన రహదారిలో గల పాత చెరువు ఎండోమెంట్, ఆర్టీసి, పంచాయతీ, రెవెన్యూ అధికారులు సాక్షిగా కబ్జాకు గురయిందని తెలియజేసారు. అలాగే చోడవరం – లక్ష్మీపురం రోడ్డులో రెవెన్యూ సర్వే నెంబర్ 11లో సుమారు ఎ.0-60 సెంట్లు పైగా కబ్జా కు గురైనట్లు అప్పటి తహసీల్దార్ తిరుమల బాబు సిబ్బందితో అడ్డుకట్ట వేసినప్పటికీ, రియల్ ఎస్టేట్ మాఫియా ఇచ్చే లంచాలతో అధికారులు మొద్దు నిద్ర నటిస్తుండగా రియల్ మాఫియా బరి తెగిస్తున్నారన్నారు. బడాబాబులు, వారిచ్చే పారితోషికాలు (లంచం)తో వారి పట్ల విధేయత కలిగిన ప్రభుత్వ అధికారులు గరీబోళ్లపై చర్యలు తీసుకోవడం చేతగాక తరచూ పేదలు, బడుగు బలహీనవర్గాలు పై తమ దాష్టీకం చూపడం తగదని, దీనిపై బాధితులు పేదల పక్షాన భారత కమ్యునిస్టు పార్టీ పోరాడుతుందని తెలియజేసారు. డ్రైనేజీల పేరుతో నిరుపేదల ఇల్లు ధ్వంసం చేసే పంచాయతీ అధికారులు,
ఏళ్ల తరబడి డ్రైనేజీలు ప్రక్కనే నిర్మాణాలు కట్టి ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తుగా ఎటువంటి నోటీసు, సమాచారం లేకుండగా మాజీ ఉప సర్పంచ్ సాగర్, పంచాయతీ కార్యదర్శి నారాయణరావు, పేదలపై దౌర్జన్యం కు పాల్పడే పోలీసులు పై ఉన్నతాధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాల తరఫున డిమాండ్ చేశారు.
అధికారుల అనైతిక చర్యలు వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ శక్తులు కొమ్ము కాస్తున్నారని స్థానికుల ఆగ్రహం చెందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img