Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

రిఫరల్ ఆసుపత్రులుగా మారిన మన్యం ఆసుపత్రులు

పట్టణాలలో పెద్ద ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు పడుతున్న గిరిజన రోగుల కుటుంబ సభ్యులు, బంధువులు

ఏజెన్సీలో ఎంత పెద్ద ఆసుపత్రులున్నా ప్రాథమిక చికిత్సకే పరిమితం అవుతున్నాయని ఆరోపిస్తున్న వైకాపా రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సుధాకర్

విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మన్యవాసుల ఆరోగ్యం మెరుగు కోసం ప్రభుత్వాలు ఎన్ని ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నా , ఎంతమంది నిపుణులైన వైద్యులను నియమిస్తున్నా మన్య ప్రాంతంలోని ఆసుపత్రులు మాత్రం రిఫరల్ ఆసుపత్రులుగానే అరకొర సేవలు అందిస్తున్నాయని వైకాపా రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జెల్లీ సుధాకర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో అరుకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాలలో పెద్ద ఆసుపత్రులు ఉన్నప్పటికీ గిరిజనులకు సరైన వైద్యం అందించే పరిస్థితిలో ఆ ఆసుపత్రులు లేవని, శరీరంలోని అన్ని విభాగాలకు వైద్యుల కొరత ఉందన్నారు. కొన్ని విభాగాలకు నిపుణులైన వైద్యులు ఉన్నప్పటికీ ప్రాథమిక చికిత్స అందించి మాకెందుకులే అని మైదాన ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏ వ్యాధి సోకింది, ప్రాణాపాయమా అనే విషయాన్ని కూడా నిర్ధారణకు రాకుండా ఆసుపత్రులకు వచ్చిన వెంటనే రోగులకు సరైన వైద్యం అందించకుండా ఆపద్బాంధవి అయినటువంటి విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించి తప్పించుకునే ధోరణిలో మన్య ప్రాంత వైద్యులు ఉన్నారని ఆయన విమర్శించారు. ఈ మధ్యకాలంలో చాలామంది యువత మృత్యువాత పడిన విషయం పాఠకులకు తెలిసిందేనని, వారి వారి తల్లిదండ్రులు ఆస్పత్రులు ఎదుట ఆవేదన వ్యక్తపరిచిన సందర్భాలు లేకపోలేదన్నారు. సాక్షాత్తు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున వైద్యుల నిర్లక్ష్యం వలన మాత శిశు మరణాలు నమోదు కావడం మన్య ప్రాంతంలో పనిచేసే వైద్యాధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నారు. ఈ సంఘటనపై పలుమార్లు విచారణలు చేపట్టినప్పటికీ మన్యప్రాంత వైద్యులు, సిబ్బందిలో ఎటువంటి మార్పులు లేకపోవడం గమనార్హం అన్నారు. వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసే విధంగా చూడవలసిన బాధ్యత సంబంధిత శాఖ ఉన్నత అధికారులపై ఉందని, ప్రతి వారం ఆసుపత్రులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే వైద్యశాఖ జాయింట్ కమిషనర్ విచారణ పేరిట చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరిండెండెంట్ ను మార్చిన విషయం పాఠకులకు తెలిసిందే అన్నారు. వైద్యం నిమిత్తం మారుమూలగిరి గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులను ఈ ప్రాంత వైద్యులు పాడేరు, నర్సీపట్నం, విశాఖపట్నం రిఫరల్ చేయబడిన రోగులతో వారి వారి కుటుంబ సభ్యులు ఆయా ఆసుపత్రులలో నానా అవస్థలు పడుతున్నారని, అమాయకులైన, నిరుపేదలైన గిరిజనులు పట్టణాలలో పెద్ద ఆసుపత్రులలో ఎక్కడ ఏ విభాగం ఉందో అర్థం కాక, ఎక్కడ ఉండాలో, ఏమి తినాలో, ఏం చేయాలో పాలు పోక మనోవేదనకు గురవుతున్నారన్నారు. రోగుల కన్నా రోగులతో వెళ్లిన బంధువులే ఇబ్బందులకు గురవుతున్నారనీ, ఈ విషయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అల్లూరి జిల్లాలో అన్ని రకాల వైద్యం అందేలా నిపుణులైన వైద్యులను వైద్య సిబ్బందిని నియమించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img