హెడ్మాస్టర్ మేరీ వర కుమారి
విశాలాంధ్ర ధర్మవరం;; కరాటే అనే క్రీడారంగంలో మరింత ఉన్నత స్థాయికి విద్యార్థులు చేరుకోవాలని హెడ్మాస్టర్ మేరీ వర కుమారి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేట పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సబ్ జూనియర్ కేటగిరి లో గవ్వల యువ సంధ్య-28 కేజీ విభాగంలో వెండి పతకముతో పాటు మూడు వేల రూపాయలను హెడ్మాస్టర్ అందజేశారు. అనంతరం మేరీ వర కుమారి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడారంగంలో మరింత రాణిస్తూ అటు పాఠశాలకు, ఇటు తల్లిదండ్రులకు, కరాటే మాస్టర్ ఇనాయత్ భాష కు మంచి పేరు, గుర్తింపు తీసుకొని రావాలని వారు తెలిపారు. పిల్లల యొక్క భవిష్యత్తు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.