విశాలాంధ్ర -అనంతపురం : కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన అనుమానస్పద చర్యకు వ్యతిరేకంగా అనంతపురం వైద్యశాల మరియు కళాశాల యందు పనిచేయుచున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మరియు హౌస్ సర్జన్స్ శుక్రవారం నుంచి విధులు బహిష్కరిస్తామని నోటీస్ ఇవ్వడం జరిగినది.
రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి 29 మంది సర్వీస్ పీజీ స్ 6, సీనియర్ రెసిడెంట్ లతో విధులను సర్దుబాటు చేసి వైద్యం అందించేలా నిర్ణయం తీసుకొనబడినది. ఈ మేరకు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్ నందు సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ డా.. మాణిక్య రావు, వైద్యశాల సూపరింటెండెంట్ డా.. కె .ఎస్ . ఎస్ . వెంకటేశ్వరరావు , ఆర్.ఎం. వో.లు, హెచ్.ఓ.డి. లు మరియు ఐ.ఎం.ఏ. ప్రెసిడెంట్ డాక్టర్ మనోరంజన్ రెడ్డి హాజరవడం జరిగినది. అవసరమైతే ఐ.ఎం.ఏ. వైద్యుల సేవలు కూడా వినియోగించుకుంటామని, అలాగే ప్రభుత్వ ప్రైవేటు నర్సింగ్ విద్యార్థుల విద్యార్థుల సేవలు కూడా వినియోగించుకొని పరిస్థితిని అదిగమిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.