విశాలాంధ్ర- ఆనందపురం (విశాఖ జిల్లా) : ఈ నెల 4వ తారీఖు ఆదివారం వాల్త్టెర్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలలో బోయపాలెం ఈస్ట్రన్ విశాఖ జూనియర్ కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు టి. భార్గవి(ఎంపీసీ)పి మాళవిక బై పిసి, పి. అజయ్ ఎంపీసీ కె.సాయి కౌశిక ఎం పి సి లు పాల్గొని అత్యుతమ ప్రతిభ కనబరచి శ్రీకాకుళం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల కరెస్పాండంట్ బిషప్ డాక్టర్ కె. అర్. సింగ్ తెలియపరచి ఎంపికయినా విద్యార్థిని, విద్యార్థుల కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల డీన్ వై. చార్లెస్ కుమార్ ఫిజికల్ డైరెక్టర్ ఎ.ప్రేమ్ కుమార్ వాల్తెర్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి లు ఎమ్. రమణ, ఎన్ సూర్య ఈస్టర్న్ విశాఖ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. కార్యదర్శి ఎన్ సూర్య మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయినా విశాఖపట్నం జిల్లా జూనియర్ బాల, బాలికల టీమ్ లకు కళాశాల కరెస్పాండంట్ బిషప్ డాక్టర్ కె. అర్. సింగ్ ఈ నెల 14 నుండి 16 తేదీ వరకు క్యాంపు కు కావలసిన భోజనం, వసతి కల్పింస్తున్నారని కళాశాల యాజమాన్యం కు వాల్తెర్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.