విశాలాంధ్ర -ఆనందపురం : ఆనందపురం మండలం జనసేన నాయకులు, విశాఖ జిల్లా రూరల్ కార్యదర్శి మజ్జి శ్రీను (రిటైడ్ ఆర్మీ)పిలుపుమేరకు మండలంలో పలు అధికారులును మర్యాదపూర్వకంగా కలిశారు. అందులో భాగంగా మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ చింత.వాసు నాయుడు, తాసిల్దార్ పేర్లి .శ్యాంప్రసాద్, ఎంపీడీవో డాక్టర్ జానకి కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రూరల్ కార్యదర్శి మజ్జి శ్రీను పలువురు అధికారులతో మాట్లాడుతూ మండలంలో సమస్యలు ఏవైనా జనసేన నాయకులు అధికారుల దృష్టికి తీసుకు వచ్చినట్లయితే స్పందించి న్యాయపరమైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన వెంటనే చేయాలని పరిష్కారం చేయాలని కోరారు గత పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ తమ్మిన అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి మూర్తి, ఉపాధ్యక్షులు శివకృష్ణ , బూత్ కన్వీనర్లు గోవింద్, ప్రశాంత్ కుమార్ నాయుడు, మండల నాయకులు లెంక శంకర్, బంగారు నాయుడు, సుబ్బు, వెంకటేష్, ఆల్తి రాజు, సురేష్, నర్సింగరావు, రాంపల్లి సురేష్, సోంబాబు,తదితర నాయకులు పాల్గొన్నారు.