,విశాలాంధ్ర-విశాఖ జిల్లా : మండలంలోని పెంట గ్రామంలో ఆదివారం రాత్రి టి నారాయణమూర్తి( 50) పై అదే గ్రామానికి చెందిన దేవరపల్లి పైడిరాజు మరో ముగ్గురితో కలిసి కత్తితో దాడి చేశారు. దేవరపల్లి పైడిరాజు కుటుంబ సభ్యులపై గతంలో పోలీసు వారు రౌడీ షీటర్ ఓపెన్ చేయడం జరిగినది. వీరు చేసే ఆగడాలను టి నారాయణమూర్తి ఎప్పటికప్పుడు ప్రశ్నించడంతో అతనిపై కక్ష కట్టి ఓ పథకం ప్రకారమే హత్యాయత్నాo చేసినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానిక గ్రామస్తులు వాపోతున్నారు. విషయం తెలిసిన పోలీసు వారు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకొని బాధితుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న టి నారాయణమూర్తిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.