విశాలాంధ్ర-ఆనందపురం : ఆనందపురం గ్రామంలో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఆలయం దగ్గర జై జవాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనందపురం గ్రామ సర్పంచ్ చందక లక్ష్మీ, మాజీ వైస్ ఎంపీపీ మీసాల సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. గ్రామం లోఅందరూ కూడా మొక్కలు నాటాలని చెప్పారు. తద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందనితెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజ్జి రాజు, కుప్ప గౌరీ, మీసాల నాగేశ్వరరావు, ముడసల బాలు, ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుప్ప రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ ముడసల శ్రీను, జనరల్ సెక్రెటరీ ఇమంది శ్రీనివాసరావు సెక్రెటరీ ముడసల కార్తీక్ కోశాధికారి కుప్ప రామలక్ష్మి సభ్యులు కుప్ప అప్పారావు చుక్క గణేష్, కుప్ప ఆనంద్ చుక్క రాజు, మెరుగు రాము తదితరులు పాల్గొన్నారు.