ఎయిమ్స్ స్కూల్ ప్రిన్సిపల్ సి.ఎచ్ బాలాజీ
విద్యార్థుల పోరాటం అలుపెరగనిది ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగభూషణం
విశాలాంధ్ర-విజయనగరం టౌన్
పట్టణంలో ఉన్న ఎయిమ్స్ పాఠశాలలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య 89వ వార్షికోత్సవాల సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ చిత్రపురానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిహెచ్ బాలాజీ పతాకావిష్కరణ చేశారు
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బాలాజీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ .నాగభూషణం మాట్లాడుతూ దేశంలో స్వేచ్ఛ సమానత్వం అందరికీ విద్యా వైద్య ఉపాధి హక్కులు అందుతున్నాయంటే దేశ చరిత్రలో పోరాటం చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఆలిండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం అలుపెరగని ఇంకా విద్యార్థులు పోరాటం చేయడం ద్వారా తమ హక్కులు కాపాడుకుంటారని
విద్యార్థుల రాజకీయాల్లోకి రావడం ద్వారానే ప్రక్షాళన జరుగుతుందన్నారు. ఆ మేరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య 1936 ఆగస్టు 12వ తారీఖున ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో బెనారస్ లో ఉద్భవించి దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన త్యాగాల జెండా ఏఐఎస్ఎఫ్ అన్నారు .
ఇవాళ దేశంలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్నదని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల మీదే ఉన్నదని కాబట్టి విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ప్రధానంగా వైద్య, విద్య సాంకేతిక విద్య లొ శాస్త్రీయత లోపించి భావాలను పెంపొందిస్తున్నారని నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలన్నారు. ఇవాళ 117జీవో రద్దు చేయాలని, యూనివర్సిటీ కేంద్రాలలో విద్యార్థులకు స్వేచ్ఛని ఇవ్వాలని నిధులు ఇవ్వాలన్నారు. ప్రాథమిక విద్యను కాపాడాలని, విచ్ఛిన్నమవుతున్న విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో జరుగుతున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు.నవంబర్ నెలలో జరిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పి. గౌరీ శంకర్ ఏఐవైఎఫ్ నాయకులు బి .వాసు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు