విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని ఇప్పలవలస గ్రామంలో శనివారంనాడు
ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి తెర్లి హేమాక్షిఆద్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంను నిర్వహించారు. వర్షా కాలంలో వచ్చేవ్యాదులు వాటిగురించి తీసుకోవలసిన జాగ్రత్తలు గ్రామస్తులకు తెలియజేశారు. చర్మ రోగాలు, వాత వ్యాధులు, మూలవ్యాధి,గ్యాస్ట్రిక్, ప్రవాహిక, శ్వాసవ్యాధులకు సంబంధించి మందులు అందజేశారు. గ్రామంలోని 68మందికి తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఆయుర్వేద వైద్యానికి ఇటీవలకాలంలో రోగులు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయుష్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు నయమౌతున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో స్థానిక పెద్దలు,ఆయుర్వేద సిబ్బంది ఎం. పైడితల్లి ఆశా కార్యకర్త పాల్గొన్నారు.