Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

గోవద శాలలు ముసివేయకపోతే ఆమరణ దీక్ష చేస్తాం. లోగిశ డిమాండ్


విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ఎదురుగా ఉన్న అక్రమ గోవద శాలలను మూసివేయాలని లేనిపక్ష0లో ఆమరణ నిరాహార దీక్ష కు దిగుతామని దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వనిదే అని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జీవబందులోగిశ రామకృష్ణ అన్నారు. సోమవారం కలెక్టరెట్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్బంగా గో హంతకులుపై రౌడీషిట్ లు తెరవాలని, గోవదకులు పై కేసులు నమోదు చెయ్యాలని, గోవద కేంద్రాలు సీజ్ చెయ్యాలని నినాదాలు చేశారు. ఈ సందర్బంగా లోగిశ రామకృష్ణ మాట్లాడుతూ గత 10సంవత్సరాలుగా కలెక్టర్, ఎస్పీ కార్యాలయం ఎదురుగా వేలాది ఆవులను సంతల్లో కొనుగోళ్లు చేసి రాత్రి పగలు అని తేడా లేకుండా దారుణంగా కత్తులుతో నరికి చంపి కండ కాండాలుగా నరికి ఐస్ బాక్స్ ల్లో వేసి కాంటైనర్ల లో వెనుల్లో పశుమాంసం కంపెనీలకు పంపిస్తున్నారని దీనిపై చర్యలు చేపట్టాలని పలుమార్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లకు పిర్యాదు చేసినప్పటికి వారు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పశుమాంసం కంపెనీలకు, పశుమాంసం వ్యాపారులకు విజయనగరం అడ్డాగా మారిందన్నారు. దీనిని అరికట్టడానికి ఎన్ని విజ్ఞప్తిలు చేసిన ఎన్ని పిర్యాదులు చేసిన పట్టించుకోకపోవడంతో విసుగుపోయి అధికారుల లంచగొండి వైఖరి పై దర్నా చేపట్టామన్నారు. ఇప్పటికి అయినా అధికారులు తీరు మార్చుకొని గోవద నిషేధ చట్టాలను, జంతు సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయకుంటే కలెక్టర్ ఆఫిసు ముందు ఆమరణ నిరాహార దీక్ష కి దిగుతామని, జరగబోయే పరిణామాలకు జిల్లా యంత్రంగాలే బాధ్యత వహించాలన్నారు.అనంతరం గ్రీవెన్స్ సెల్ లో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కు పిర్యాదు చేశారు.కలెక్టర్ స్పందించి పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ వై. వి రమణను, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ను పిలిచి పోలీసు వారితో కలసి గోవదలు జరగకుండా రాత్రి పూట గస్తీ ని నిర్వహించాలని అక్రమ కాబేలాలు లేకుండా చర్యలు చేపట్టాలని రిపోర్ట్ ను తమకు తెలియజేయాలని ఆదేశాల జారీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు చోళ్ళ. రాజకుమారి, పట్టణ అధ్యక్షులు మద్దిల సోంబాబు, కార్యదర్శి రెడ్డిపల్లి రవిశంకర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నీలాపు దేవి, హిందూ సంఘ నాయకులు ఎన్.సాయి కుమార్, మజ్జి రామారావు, వి. నాగరాజు శర్మ, ఎ. నారాయణమూర్తి, లోకేష్ బాబు, జంతుసంక్షేమ నాయకులు గండికోట శాంతి, ఉప్పాడ పైడితల్లి, సోము వెంకటలక్ష్మి, పి. సత్యం, ఎ. శివ, కె. శ్రీనివాసరాజు, ఎం.డీ గురునాద్ శర్మ,ఆర్. పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img