Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

ఏపీ మోడల్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్పర్సన్ గా జైరాజ్

విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వ విద్యా శాఖ ఎన్నికల్లో భాగంగా గురువారం విజయనగరం అయ్యప్ప నగర్ ఏపీ మోడల్ స్కూల్ లో నిర్వహించిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో సీనియర్ జర్నలిస్టు సీహెచ్ సింహాద్రి(జైరాజ్) ఛైర్పర్సన్ గా ఎన్నికైనట్లు స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రుక్సానా పర్వీన్ తెలిపారు. వైస్ ఛైర్పర్సన్ గా పి మాధవి ఎన్నికైనట్లు ఆమె పేర్కొన్నారు. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ఎన్నికలు ప్రజా స్వామ్య బద్దంగా జరిగాయని తెలిపారు. ఆరు నుంచి పది తరగతుల్లో ఒక్కో తరగతి నుంచి ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని తల్లిదండ్రుల ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అలా ఐదు క్లాస్ ల నుంచి పది మంది మహిళలు, ఐదుగురు పురుషులతో కలిపి పదిహేను మంది సభ్యులతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక కాగా, ఆ బాడీ సభ్యులంతా కలిసి ఓటింగ్ ప్రక్రియ ద్వారా కమిటీ ఛైర్పర్సన్ గా సింహాద్రి జైరాజ్ ను, వైస్ ఛైర్పర్సన్ గా పి మాధవిని ఎన్నుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశానికి స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ ముచ్చు లయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఆమె అభినందించారు. విద్యార్థుల విద్యా ప్రగతికి, స్కూల్ అభివృద్ధికి కమిటీ ఉత్సాహంగా పని చేయాలని ఆమె సూచించారు. ప్రజా ప్రతినిధులుగా పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి డివిజన్ ఇన్చార్జి పార్వతీ, వైసిపి డివిజన్ ఇన్చార్జి మచ్చు శ్రీనివాస్ రావు హాజరై కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img