Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్, సోమవారం నిర్వహించారు.
ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించి, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 31 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల్లో చాలా వరకు భూతగాదాలకు సంబంధిచినవి అధికంగా ఉన్నట్లుగా తెలిపారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించినవి 14, కుటుంబ కలహాలకు సంబంధించి నాలుగు ఫిర్యాదులు, మోసాలకు పాల్పడినట్లుగా 6 ఫిర్యాదులు, ఇతర విషయాలకు సంబంధించినవి 7 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవమైనట్లయితే చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7దినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, డిసిఆర్బి సిఐ జె.మురళి, ఎస్బీ సిఐలు కే.కే.వి.విజయనాధ్, ఈ.నర్సింహ మూర్తి, డిసిఆర్బి ఎస్ఐ గణేష్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img