విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : విజయనగరం పట్టణం ట్రాఫిక్ పోలీసు స్టేషనులో పని చేస్తున్న 72మంది ట్రాఫిక్ పోలీసులకు శ్వేత హార్డివేర్ అండ్ ఎలిక్ట్రికల్స్ యాజమాన్యం అందజేసిన రెయిన్ కోట్స్ ను జిల్లా ఎస్పీ ఎం. దీపిక, ఐపిఎస్ చేతుల మీదుగా జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ – ట్రాఫిక్ పోలీసులు ఎండలోను, వర్షంలోను వాహనాల రాక, పోకలను రెగ్యులేట్ చేసేందుకు ట్రాఫిక్ విధులు నిర్వహించే పరిస్థితులు ఉంటాయన్నారు. వర్షా కాలంలో ట్రాఫిక్ విధులు నిర్వహించుటలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకుగాను విజయనగరం పట్టణం తాశీల్దారు కార్యాలయంకు దగ్గరలో ఉన్న శ్వేత హార్డివేర్ అండ్ ఎలక్ట్రికల్ యాజమాన్యం ఇందుకూరి సుమన్ ట్రాఫిక్ పోలీసు స్టేషనులో పని చేస్తున్న సిబ్బంది అందరికి రెయిన్ కోట్స్ ను ఉచితంగా అందజేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇందుకూరు సుమన్ అందజేసిన 72 రెయిన్ కోట్స్ ను ట్రాఫిక్ పోలీసు స్టేషనులో పని చేస్తున్న సిబ్బంది అందరికీ అందజేయాలని ట్రాఫిక్ సిఐ పి.రంగనాధంను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అందజేసారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ పి.రంగనాధం, శ్వేత హార్డివేర్ అండ్ ఎలిక్రికల్స్ యజమాని ఇందుకూరి సుమన్, ట్రాఫిక్ ఎస్ఐ ఎ.ఎం.రాజు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు