విశాలాంధ్ర- విజయనగరం టౌన్ : తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విజయనగరం మన్యం జిల్లాలలో శ్రావణమాస మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామింగ్ అధికారి జె.శ్యాంసుందర్ తెలిపారు. మంగళవారం దీనికి సంబంధించిన ఫ్లెక్సీ బోర్డును స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పివి నరసింహాచార్యులు, అమ్మానాన్న సేవా సంస్థ కార్యదర్శి జివి తిరుపతిరావు, బుచ్చి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు