విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక పోలిస్ స్టేషన్ ను కొత్తగా విచ్చేసిన సబ్ డివిజన్ ఏఎస్పీ అంకిత సూరన గురువారంనాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను, పాత కేసులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల గూర్చి ఆరాతీశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.అనంతరం స్టేషన్ పరిధిలో గతంలో 23 కేసులలో పట్టుకున్న 736 అక్రమ మద్యంబాటిల్లను ఆమె మధ్యవర్తుల సమక్షంలో తగలబెట్టించారు. పార్వతిపురం సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల కాపాడడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎం రాజేష్ పాల్గొన్నారు.