ప్రజా ప్రతినిధుల జులుం…
విశాలాంధ్ర – కొయ్యలగూడెం: చిరువ్యాపారస్తుల అభివృద్ధికి అన్ని అడ్డంకులేనా? కొయ్యలగూడెం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న చేపల వ్యాపారస్తుల దుకాణలు ఏర్పాటు కు ఫిషరీష్ శాఖ తరపున రూ. 3 లక్షల60వేలు మంజూరు కాగా, పరింపూడి గ్రామ పంచాయతీ తరుపున రూ. 3 లక్షల90వేలతో నిర్మిస్తున్న చేపల దుకాణలకు అన్ని అడ్డంకులె ఎదురవుతున్నాయి. పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు , ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో చేపల దుకాణాల ఏర్పాటుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. అధికార పార్టీలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులే చేపల దుకాణాలు నిర్మించవద్దని అడ్డుకోవడంతో చిరు వ్యాపారం చేసుకుని జీవనం కొనసాగించే మత్స్యకారులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజల అభివృద్ధిని కోరుకునే ప్రజాప్రతినిధులే చిరు వ్యాపారుల అభివృద్ధికి సహకరించకపోవడంతో, మత్స్యకారులు నిరాశ ఆందోళన చెందుతున్నారు. గ్రామ పంచాయతీ ద్వారా నూతనంగా షెడ్డులు నిర్మించి, తమకు ఇస్తున్నారని ఆనందం ఎన్నో రోజులు లేదు.ప్రజా ప్రతినిధుల అడ్డంకులతో తమ జీవితాలు దుర్భరంగా మారి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఎండ వేస్తే ఎండలో, వాన వస్తే వానలో, నెత్తిన నీడ కూడా లేకుండా వ్యాపారాలు నిర్వహించవలసి వస్తుందని వాపోతున్నారు. తమను పట్టించుకునే నాధుడు లేడా అనే సమయంలో ఫిషరీస్ శాఖ, గ్రామపంచాయతీ వారి ఆధ్వర్యంలో నూతనంగా దుకాణాలు నిర్మిస్తున్న తరుణంలో మండలానికి చెందిన ప్రజా ప్రతినిధి దుకాణాల నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు న్యాయమని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క ముఖ్యమంత్రి జగన్ చిరు వ్యాపారస్తులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నా మండల స్థాయిలో మాత్రం అధికార పార్టీకి చెందిన నాయకులే అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడంతో ప్రజలలో అసంతృప్తి సెగలు రెరుగుతున్నాయి. ఏది ఏమైనా సరే పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు మత్స్యకారులకు దుకాణాల ఏర్పాటులో జోష్యం చేసుకుని పరిష్కారం చేయకపోతే దుకాణాల నిర్మాణాలు మభ్యంతరంగా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ముఖ్యమంత్రి ఆశయం నీరుగారే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా తమ మొండి పట్టుదలకు పోకుండా మత్స్యకారులకు అండగా ఉండాలని కోరుతున్నారు.