హౌసింగ్ డిఇ ప్రసాద్
పశ్చిమగోదావరి జిల్లా
విశాలాంధ్ర – గణపవరం: గృహ నిర్మాణ లబ్ధిదారులు వచ్చే ఏడాది మార్చి 31 లోపు గృహ నిర్మాణం పూర్తి చేయాలని లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అందించే రుణం లబ్ధిదారులు ఖాతాలో పడతాయని తాడేపల్లిగూడెం హౌసింగ్ డిప్యూటీ ఇంజనీర్ కె వి ఎస్ ఎస్ ప్రసాద్ అన్నారు. శనివారం గణపవరం మండలం పిప్పర గ్రామ లో ఉన్న లేఅవుట్ నందు “మన ఇల్లు మన గౌరవం” అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హౌసింగ్ డిఇ మాట్లాడుతూ గృహ నిర్మాణ లబ్ధిదారులు హౌసింగ్ నిర్మాణం పూర్తి చేయాలని లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రుణం వెనక్కి వెళ్లే అవకాశం ఉందని గ్రామాల్లో ఉన్న హౌసింగ్ లబ్దారులకు ప్రతి గ్రామంలో అధికారులు లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి వారికి ఈ విషయాలు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ సదస్సులో గణపవరం హౌసింగ్ ఏ ఇ కె కిరణ్ కుమార్, పిప్పర గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ,, లేవుట్ అధికారులు, లైన్ డిపార్ట్ మెంట్ అధికారులు వెలుగు అధికారులు గృహ నిర్మాణ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.