విశాలాంధ్ర -తాడేపల్లిగూడెం రూరల్ : పెద తాడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు క్రీడల్లో ఆటల్లో విశేష ప్రతిభ కనపరచడంతో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఎంపికైన విద్యార్థులను శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలు ఎస్.కె లాల్ బిబి అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల స్థాయిలో అండర్ 17 అండర్ 14 బాలురు, బాలిక విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు అన్నారు షాట్ పుట్, డిస్క్ తో , వాలీబాల్ కబడి విభాగాల్లో తమ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు, ఇదే క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లా స్థాయిలో రాణించాలని విద్యార్థులకు సూచించారు క్రీడల్లో రాణిస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది అన్నారు చదువుకున్న పాఠశాలతో పాటు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు గుర్తింపు దక్కుతుందన్నారు క్రీడాకారులను ఎంఈఓ హనుమ, డి వై ఇ ఓ రవీంద్ర భారతి, తదితరులు అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల పిఈటి ఏ.నాగార్జునరావు , ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు