ఇరాన్ మీద ఇస్రాయెల్, అమెరికా అధర్మ యుద్ధం ప్రారంభించి తొమ్మిది నెలలైంది. రెండు వేపులా అపార నష్టం జరగడం సహజమే. కానీ అత్యంత శక్తిమంతమైన అమెరికా ఇస్రాయెల్తో కలిసి తమ గడ్డ మీద బాంబుల వర్షం కురిపి స్తున్నా ఇరాన్ తొణకలేదు. ఇరాన్‌ను లొంగదీయడం వీలుకాదని గ్రహించిన అమెరికా అధ్యక్షుడు ఒకసారి శాంతి గురించి ప్రవచి స్తారు. ఆ మరుసటి రోజే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామని బెదిరి స్తారు. తాజాగా ఇరాన్ మీద అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని బెది రిస్తున్నారు. హారిస్ ట్రూమన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు సరిగ్గా 80 ఏళ్ల కిందట హిరోషిమా, నాగసాకి మీద అణు బాంబులు కురిపించి సృష్టించిన మారణహోమం గాయాలు మానవళికి ఇప్పటికీ మాననే లేదు. ఇలాంటి దశలో ఇరాన్ మీద అణ్వస్త్రాలు ప్రయోగి స్తామని ట్రంప్ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం ఒక్క పర్షియన్ సింధు శాఖ దేశాల సర్వనాశనానికే కాక మొత్తం మానవాళి మీదే, ముఖ్యంగా అణ్వస్త్ర దాడికి గురైన పరిసర ప్రాంతాలలో మారణహోమం జరుగు తుంది. ఆ ప్రభావం దశాబ్దాల తరబడి కొనసాగుతుంది. డోనాల్డ్ ట్రంప్ ఇంతటి యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించడానికి ఏకైక కారణం ఇటీవలి ఎన్ని కల్లో ఓడిపోయిన ఇస్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహూను అడ్డ దారినో, దొడ్డిదారినో మళ్లీ అధికారంలో ప్రతిష్టించడమే. అమెరికా అండ చూసుకుని ఇస్రాయెల్ ఇప్పటికే తీవ్రవాద రాజ్యంగా మారిపోయింది. నిజంగా అణ్వస్త్ర ప్రయోగమే జరిగితే ఇస్రాయెల్ సురక్షితంగా ఉండే మార్గమే ఉండదు. అమెరికాలో మధ్యంతర ఎన్నికల తరవాత ఇరాన్ మీద అణ్వస్త్ర దాడి గురించిన చర్చ చాలా రోజులుగా సాగుతూనే ఉంది. అణ్వస్త్ర దాడి మాట ఎలా ఉన్నా ఇరాన్‌కు సంబంధించినంత మేరకు గత తొమ్మిది నెలలుగా యుద్ధం ఆగిన లేదా ముగిసిన సందర్భమే లేదు. మాటవరసకు అమెరికా దాడులు ఆగినా ఇస్రాయెల్ నిరంతరం కయ్యా నికి కాలుదువ్వుతూనే ఉంది. అడపాదడపా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. అయితే ఇరాన్ ససేమిరా ఈ బెదిరింపులకు లొంగడం లేదు. అణ్వస్త్రాలే ప్రయోగించినా తమ ప్రతిఘటన ఆగదని ఇరాన్ హెచ్చరి స్తోంది. అణ్వస్త్రాలే ప్రయోగిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని ఇరాన్ అంటోంది. అలాంటప్పుడు పర్షియన్ సింధు శాఖలో అమెరికా కొమ్ము కాస్తున్న దేశాలు మాత్రం సురక్షితంగా ఉండలేవు. ఇరాన్ మీద యుద్ధ బీభత్సం నుంచి ప్రపంచం ఇప్పటికీ బయటపడనే లేదు. విచిత్రం ఏమి టంటే ట్రంప్ దుస్సాహసాన్ని నాటో కూటమి దేశాలు, ఇతర యూరప్ దేశలు సమర్థించనే లేదు. ఎలాగైనా యుద్ధం కొనసాగించేట్టు చూసి ఆయుధాల వ్యాపారం జోరుగా సాగేట్టు చూడాలన్నది ట్రంప్ దురా లోచన. కానీ అణ్వస్త్ర ప్రయోగం తరవాత ప్రపంచంలో గణనీయ మైన భాగం అంధకారబంధురం అవుతుంది కాబట్టి ఆయుధాలు కొనేవారు మాత్రం ఎవరు ఉంటారో! అణ్వస్త్ర ప్రయోగం అంటే మరో భీకర మారణోమమే. మొత్తం భూమండల వాతావరణం సర్వనాశనం కావడమే. ఓటమి పాలైన నెతన్యాహూ సింహాసనాన్ని కాపాడడం కోసం ట్రంప్ ఈ మారణ హోమానికి పాల్పడడం అంటే ఆయనకు మతి స్థిమితం తప్పినట్టే. ఇరాన్ మీద యుద్ధానికి ట్రంప్‌ను పురికొల్పిందే ఇస్రాయెల్ అధినేత నెతన్యాహూ. ఆయన రక్తదాహం ఎన్నటికీ తీరేట్టు లేదు. తోచినప్పుడల్లా ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించినప్పుడూ నెత న్యాహూ దుస్సాహసం కొనసాగిస్తూనే వస్తున్నారు. మళ్లీ అమెరికాను పురికొల్పడానికి నెతన్యాహూ దగ్గర ఏ శక్తి ఇంకా ఉన్నట్టు? నెతన్యాహూ వైఖరిని ట్రంప్ చీదరించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇరాన్ మీద యుద్ధానికన్నా ముందే గజా మీద రెండేళ్ల నుంచి ఇస్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. గజా శిథిల నగరంగా మారిపోయింది. 75,000 కన్నా ఎక్కువ మందిని ఇస్రాయెల్ ఈ దాడుల్లో హత మార్చింది. లక్షలాది మంది గాయపడ్డారు. నిర్వాసితులయ్యారు. ఇప్పటికీ వారికి దిక్కుమొకూక్క లేదు. ఇరాన్ మీద ట్రంప్ అణ్వస్త్రాలు ప్రయోగించే దుస్సాహసం చేయకుండా నివారించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌర సమాజం అమెరికా పార్లమెంటుకు విజ్ఞప్తి చేస్తోంది. అణ్వస్త్ర నిరోధం కోసం అంతర్జాతీయ వైద్యుల సంఘం, సామాజిక బాధ్యతగల వైద్యుల బృందాలు అణ్వస్త్ర ప్రయోగ ఆలోచనల నుంచి ట్రంప్‌ను కట్టడి చేయా లని అమెరికా పార్లమెంటును అభ్యర్థిస్తున్నాయి. అణ్వస్త్ర నిరోధం కోసం అంతర్జాతీయ వైద్యుల సంఘానికి 1985లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది. దాదాపు 200 అంతర్జాతీయ సంస్థలు అణ్వస్త్ర ప్రయోగాన్ని నివారించాలని మొరపెట్టుకుంటున్నాయి. మన దేశంలో శాంతి కోసం పాటుపడే డాక్టర్ల సంఘం కూడా ఇదే విజ్ఞప్తి చేస్తోంది. అణ్వస్త్ర ప్రయోగ ప్రస్తావనే కేవలం బెదిరింపు కాకనూపోవచ్చు. ఇరాన్ మీద ఒక్క అణ్వ స్ర్తాన్ని ప్రయోగించినా 80 ఏళ్లుగా నివారిస్తూ వచ్చిన అణు యుద్ధాన్ని ఎందుకూ కొరగాకుండా చేయడమే. హిరోషిమా, నాగసాకి మీద 1945లో వేసిన అణు బాంబులకన్నా ఇప్పుడున్న అణ్వస్త్రాలు చాలా శక్తిమంతమైనవి. మొత్తం మానవాళికే ప్రమాదం. అణుయుద్ధమే వస్తే ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్న శీతోష్ణ స్థితిలో మార్పులు భయానకంగా మారిపోతాయి. పంటలు పండించడం అసాధ్యం కావొచ్చు. సమస్త జీవరాశుల అస్తిత్వానికే పెద్ద ప్రమాదం అనివార్యం. ఈ పరిణామాలు ఇరాన్‌కే పరిమితం కావు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ప్రకారం అణ్వస్త్రాలున్న దేశాలపై అణ్వస్త్ర నిర్మూలనకు పాటు పడవలసిన బాధ్యత కూడా ఉంది. వైపరీత్యం ఏమిటంటే అణ్వస్త్రాలున్న దేశాలు కొత్త అణ్వ స్త్రాలను ఉత్పత్తి చేయడమే కాకుండా వాటిని మరింత ఆధునీకరిస్తు న్నాయి. ఇందులో అమెరికాదే పైచేయి.
అణ్వస్త్రాల విషయంలో పైచేయి సాధించడానికి ప్రయత్నించడం అంటే ఇప్పటికే కుమ్మరి ఆవంలా ఉన్న అంతర్జాతీయ సమాజాన్ని మరింత ప్రమాదం లోకి నెట్టడమే. మొదట అణ్వస్త్రాలు ప్రయోగించే అవకాశాన్ని అమెరికా అట్టిపెట్టుకుంది. ట్రంప్ రోజుకో రకంగా మాట్లాడడం, యుద్ధోన్మాద వైఖరి అనుసరించడం పరిస్థితిని మరింత భయానకం చేస్తోంది. ఈ విధ్వంసాన్ని ఊహిస్తున్న దాదాపు 200 అంతర్జాతీయ సంస్థలు ట్రంప్ అణ్వస్త్రాలు ప్రయోగించ కుండా కట్టడి చేయాలని అమెరికా పార్ల మెంటును గట్టిగా కోరుతు న్నాయి. యుద్ధం చేయడానికి అమెరికా అధ్య Å£Œ”డికి ఉన్న అధికారాన్ని అణ్వస్త్ర యుద్ధం ప్రారంభించడానికి వీలు లేకుండా చేయాలని శాంతి కోరుకునే వారందరూ ప్రయత్నిస్తున్నారు. యుద్ధం చేయడానికి అమెరికా అధ్యక్షడికి ఉన్న అధికారం నిర్నిరోధ మైంది కాకూడదు. రష్యా-ఉక్రేన్ మధ్య అయిదేళ్లుగా యుద్ధం కొనసాగు తూనే ఉంది. రష్యా సైతం అణ్వస్త్రాలు ఉపయోగిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో సులభంగానే ఊహించుకోవచ్చు. ఇరాన్‌ను సమర్థిస్తున్న చైనా, ఉత్తర కొరియా దగ్గరా అణ్వస్త్రాలున్నాయి. నిరంతరం తగవులాడుకునే భారత్-పాకిస్థాన్ సైతం అణ్వస్త్రాలున్న దేశాలే. ఏ దేశం అణ్వస్త్రాలు ప్రయో గించినా అది మొత్తం ప్రపంచాన్నే నామరూపాలు లేకుండా చేస్తుంది.
అణ్వస్త్ర ప్రయోగానికి ట్రంప్ తహతహ
- Advertisement -


