బెంగుళూరు: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 ప్రారంభమైనప్పటి నుండి, ఎక్కువ మంది వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాల కోసం అమెజాన్.ఇన్‌లో పరిశోధన, పోల్చిచూడటం, కొనుగోలు చేస్తున్నారు. దీని ఫలితంగా, ఈ విభాగం దాని సగటు రోజువారీ వృద్ధి రేటుతో పోలిస్తే 6 రెట్లు వృద్ధిని సాధించింది. చేతక్ మరియు ఆంపియర్ వంటి ఈవీ బ్రాండ్లు, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో వంటి పాత భారతీయ బ్రాండ్లు, అలాగే ట్రయంఫ్, కేటీఎం వంటి ప్రీమియం అంతర్జాతీయ బ్రాండ్లు జనాదరణ పొందిన ఎంపికలలో ఉన్నాయి. ఇది ద్విచక్ర వాహన కొనుగోలుదారులలో ఆన్లైన్ షాపింగ్ వైపు బలమైన మార్పును ప్రతిబింబిస్తుంది. ఈ మార్పు మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. ప్రస్తుతం ద్విచక్ర వాహన అమ్మకాలలో 60% కంటే ఎక్కువ వాటా మెట్రోయేతర ప్రాంతాల నుండే వస్తోంది. సూరత్, కోట, విశాఖపట్నం, భువనేశ్వర్, ప్రయాగ్‌రాజ్, నెల్లూరు, వరంగల్, అమృత్సర్, లుధియానా, బెళగావి, కాన్పూర్, భిల్వారా వంటి నగరాలు దీనికి నాయకత్వం వహిస్తున్నాయి. చేతక్, యాంపియర్ వంటి కంపెనీల నేతృత్వంలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) తమ సగటు రోజువారీ వృద్ధి రేటు కంటే 8 రెట్లు అధికంగా వృద్ధి చెందుతూ పుంజుకుంటుండగా, ఈ షాపింగ్ ఈవెంట్ సమయంలో రోజువారీ ప్రయాణికులు 13.5 రెట్ల వేగంతో కదులుతున్నారు. కస్టమర్లు మరింత శక్తివంతమైన, వైవిధ్యభరితమైన వాహనాలకు అప్‌గ్రేడ్ అవుతుండటంతో, ప్రీమియం మోటార్‌సైకిళ్లు కూడా 2.5 రెట్ల వృద్ధిని నమోదు చేశాయి. కస్టమర్లు హెల్మెట్లు, డాష్‌క్యామ్‌లు, రైడింగ్ గేర్, కార్ పెర్ఫూయూమ్లు, కార్ వాక్యూమ్ క్లీనర్లు, విడి భాగాలు, ఇతర కార్ కేర్ నిత్యావసరాల వంటి భద్రతా పరికరాలు, వాహన సంరక్షణ, నిర్వహణపై కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఇది అమెజాన్.ఇన్ ఆటోమోటివ్ స్టోర్‌లో 2.2 రెట్ల వృద్ధికి దారితీసింది.
అమెజాన్ ఇండియాలో 6 రెట్లు పెరిగిన ద్విచక్ర వాహనాల విక్రయాలు
- Advertisement -


