Homeఅంతర్జాతీయంఇరాన్‌పై మళ్లీ దాడులకుట్రంప్ వ్యూహరచన

ఇరాన్‌పై మళ్లీ దాడులకుట్రంప్ వ్యూహరచన

- Advertisement -

వాషింగ్టన్/తెహ్రాన్: మధ్యంతర ఎన్నికల తర్వాత ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై మరోమారు భీకర దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇదే క్రమంలో ఈ సారి దాడులు ఏ స్థాయిలో జరగాలి. ఏయే ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించాలి, ఎన్ని యుద్ధ విమానాలను రంగంలోకి దించాలి వంటి అంశాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సైనికాధికారులతో కలిసి సమీక్షించినట్లు సమాచారం. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్‌ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్లతో పాటు పశ్చిమాసియాలోని అమెరికా ఉన్నత కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌తో ఆయన శ్వేతసౌధంలో సమావేశమయ్యారని వార్తా కథనాలు వెల్లడించాయి. ఇదే క్రమంలో గల్ఫ్ దేశాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఇరాన్ మౌలిక సదుపాయాలు, పీకాక్స్‌ పర్వతం సహా అణు స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసేందుకు వ్యూహం సిద్ధమైందని, ట్రంప్ ఆమోదించగానే సైనిక చర్య అమల్లోకి రానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇదిలావుంటే, ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్‌పై సైనిక చర్య చేపడతామని ట్రంప్ హెచ్చరించడాన్ని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ ప్రస్తావించారు. ఆరు నూరైనా తమను లొంగదీసుకోవడం అమెరికా తరం కాదని తేల్చిచెప్పారు. శాంతి చర్చల్లో పురోగతి కోసం తమ ఏడు షరతులను అంగీకరించాల్సిందేనని స్పష్టంచేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు