నెతన్యాహు
తెల్ అవీవ్: ఇజ్రాయిల్ ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యమున్నట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. యునైటెడ్ అరబ్ లిస్ట్, జాయింట్ లిస్ట్ కూటములు ఎన్నికలను కొల్లగొట్టాయని ఆరోపించారు. విదేశీ శక్తులు జోక్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పార్లమెంటు స్వాదీనానికి, తమ పాలన అంతానికి ప్రయత్నాలు జరిగినట్లు తెలిపారు. అరబ్ పార్టీలపై విరుచుకుపడ్డ ఆయన వాటికి అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడితే ఇజ్రాయిల్‌కు ప్రమాదమని హెచ్చరించారు. ఇరాన్ విషయంలో ఇజ్రాయిల్ వెనకడుగు వేయాల్సి రావచ్చన్నారు. ఏ జియోనిస్ట్ పార్టీ కూడా అరబ్ కూటములకు సహకరించరాదని ‘ఎక్స్’లో నెతన్యాహు కోరారు. విదేశీ శక్తుల జోక్యంపై వచ్చిన ఆరోపణల క్రమంలో పోలీసులు, అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థలు తక్షణమే దర్యాప్తు జరపాలన్నారు. కాగా, తాజా ఎన్నికల్లో నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 53 సీట్లు, మాజీ సైన్యాధిపతి గడీ ఐసెన్‌కోట్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీ 48 సీట్లు గెలుచుకునే అవకాశముంది. అరబ్ పార్టీలకు 19 సీట్లు దక్కుతాయని అంచనా. మొత్తం 120 సీట్లున్న నెస్సెట్‌లో… నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 61 మంది మద్దతు ఉండాలి. అయితే ప్రస్తుతం ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించే పరిస్థితి లేదని ఎన్నికల విశ్లేషకులు, పరిశీలకులు అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఎన్నికలను అరబ్ పార్టీలు కొల్లగొట్టాయి
- Advertisement -
RELATED ARTICLES


