Homeవ్యాపారంఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌ రూ. 20,259 కోట్ల న్యూ బిజినెస్ ప్రీమియం నమోదు

ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌ రూ. 20,259 కోట్ల న్యూ బిజినెస్ ప్రీమియం నమోదు

- Advertisement -

ముంబై: దేశీయంగా అగ్రగామి జీవిత బీమా సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌ 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన వ్యవధికి రూ. 20,259 కోట్ల న్యూ బిజినెస్ ప్రీమియం సాధించింది. 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన వ్యవధిలో ఇది రూ. 18,349 కోట్లుగా నమోదైంది. ఇక 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన వ్యవధితో పోలిస్తే రెగ్యులర్ ప్రీమియం 21 శాతం వృద్ధి చెందింది. ప్రొటెక్షన్‌పై ప్రధానంగా దృష్టి పెడుతుండటానికి నిదర్శనంగా ప్రొటెక్షన్‌కి సంబంధించి ఎస్‌బీఐ లైఫ్ న్యూ బిజినెస్ ప్రీమియం 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన వ్యవధికి 46 శాతం వృద్ధి చెంది రూ. 3,235 కోట్లకు చేరింది. ప్రొటెక్షన్ ఇండివిడ్యువల్ న్యూ బిజినెస్ ప్రీమియం 20 శాతం వృద్ధి చెంది రూ. 446 కోట్లకు చేరింది. ఇండివిడ్యువల్ న్యూ బిజినెస్ ప్రీమియం 2025 సెప్టెంబర్ 30 నాటితో పోలిస్తే 13 శాతం వృద్ధి చెంది రూ. 13,732 కోట్లకు పెరిగింది. ఎస్‌బీఐ లైఫ్ లాభం (ప్యాట్) 2025 సెప్టెంబర్ 30 నాటితో పోలిస్తే 2026 సెప్టెంబర్ 30 నాటికి 17 శాతం వృద్ధి చెంది రూ. 1,274 కోట్లకు చేరింది. కంపెనీ సాల్వెన్సీ నిష్పత్తి అనేది నియంత్రణ సంస్థ నిర్దేశించిన 1.50 కన్నా పటిష్టంగా 1.97గా నిల్చింది. ఎస్‌బీఐ లైఫ్ ఏయూఎం కూడా 2025 సెప్టెంబర్ 30 నాటి రూ. 4,81,465 కోట్లతో పోలిస్తే 2026 సెప్టెంబర్ 30 నాటికి 9 శాతం వృద్ధి చెంది రూ. 5,27,120 కోట్లకు చేరింది. డెట్, ఈక్విటీ నిష్పత్తి 60:40గా ఉంది. 94 శాతం డెట్ పెట్టుబడులు ఏఏఏ, సావరిన్ సాధనాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా కంపెనీకి 1,244 కార్యాలయాలవ్యాప్తంగా 3,94,574 మంది సుశిక్షితులైన బీమా నిపుణులతో విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్ ఉంది. ఇందులో బ్యాంకెష్యూరెన్స్‌, ఏజెన్సీ, కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్స్‌, బీమా మార్కెటింగ సంస్థలు, వెబ్ అగ్రిగేటర్లు, డైరెక్ట్ బిజినెస్ మొదలైన ఇతరత్రా మాధ్యమాలు కూడా ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు