మా మామయ్య, బావగారైన ఏటుకూరి ప్రసాద్గారు ఒక భూమి, ఒక ఆకాశం, ఒక సముద్రం. ఈ మూడు వేటికి ప్రతీకలో అందరికీ తెలిసిన విషయమే. ప్రసాద్గారిలో భూమికున్నంత సహనం ఉంది. మనసంతా ఆకుపచ్చటి తనమే. ఆకాశం అంత అభ్యుదయ భావాల నిండుకుండ ఆయన. సముద్రం అంత లోతుపాతులు కల శక్తి ఆయన. ప్రసాద్ శబ్దంలోనే ప్రప్రగతి, సాసౌమ్యత, ద్దానగుణం ఉన్నాయి. ఆయన కేవలం శబ్దాలలో జీవించలేదు. అర్థాలలో జీవించారు. చిక్కడపల్లిలో మా పుట్టిల్లు ఉంది. ఆ ఇంటికి డబ్బై సంవత్సరాలు. ఇంటి ముందు అరుగులు ఉన్నాయి. మా నాన్నగారైన కీööశేöö చింతలపాటి అప్పారావుగారు నిజాం టైమ్లో హైదారాబాద్‌కి వచ్చారు. ఆంధ్ర విద్యాలయ కట్టెలమండి, చిక్కడపల్లి, ఎ.వి.కాలేజ్ దోమలగూడా, ఫౌండర్, ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. మా నాన్నగారు, మామయ్య ఆ అరుగుల మీద తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాల గురించి మాట్లాడుతూ ఉండేవారు. ఆదిరాజు వీరభద్రరావు, బీఎన్ శాస్త్రీ ఇంకా చాలామంది వస్తూ ఉండేవారు. శాసనాల మీద చర్చలు జరిపేవారు. నేనే వింటూ ఉండేదాన్ని. అంతగా తెలివితేటలు లేని వయసు. అయినా వింటూ ఉంటే నాకెంతో సంతోషం కలిగేది. దాని ప్రభావం ఈనాటి వరకు నాపైన ఉంది. మా చిన్నప్పుడు మామయ్య పిల్లలందరికి ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’ , ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన’ ఇటువంటి ‘విలువైన పాటలు నేర్పేవారు. మామయ్య ఇంటికి ఇప్పటికి 56 సంööలు. నాకు 20సంööల వయసులో కొడుకు పుట్టాడు. నా కొడుకు ప్రశాంత్ పుట్టినప్పుడు ఆ ఇల్లు కొన్నారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు అందరం చిన్నపిల్లలం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మా అందరికి ఒక వటవృక్షం అయి ఛాయనిచ్చారు. మా కుటుంబం అంతా ఆయనకి రుణపడి ఉన్నది. మామయ్య ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. నిత్య కళ్యాణం పచ్చతోరణం. నిజానికి ఆ ఇల్లు వడ్డించిన విస్తరి. కాని మామయ్య అనునిత్యం విస్తరే దొరకని అభాగ్యుల గురించి ఆలోచించేవారు. ఆ ఇంట్లో ముందుగదిలో లెనిన్, ఏంగెల్స్ ఫొటోలు ఉండేవి. ‘పదండి ముందుకు’ అన్న పేరుతో ఒక చిత్రపటం ఉండేది. జెండాలు పట్టుకుని కొందరు యువకులు ముందడుగు వేస్తూ ఉంటారు. కొందరు నేలన పడిపోయి ఉంటారు. రక్తం పారుతూ ఉంటుంది. పెద్దయ్యాక తెలుసుకున్నాను మామయ్యకు శ్రమశక్తి, ఆదర్శం అని. వాళ్ల ఇంటికి సోవియట్ భూమి, సోవియట్ లాండ్ పత్రికలు వచ్చేవి. అక్కడ కూర్చుని నేను చదువుతూ ఉండేదాన్ని. ఆ ఇల్లు ఒక సాహిత్య నిలయం. బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, చాగంటి సోమయాజులు, భద్రిరాజు కృష్ణమూర్తి ఇట్లా ఎందరో మహానుభావులు వస్తూ ఉండేవాళ్లు. 1961 ఆ టైమ్లో మామయ్య వాళ్లు వెంకటేశ్వరస్వామి గుడికి చిక్కడపల్లి ఆపై సందులో ఉండేవాళ్లు. అక్కడ నేను శ్రీశ్రీగారిని చూశాను. మామయ్య పిల్లలని సినిమాలకు తీసుకువెళ్లేవారు. నా చిన్నప్పుడు ఆయన ‘స్పారట్కస్’, ‘బెన్హర్’ ‘పాత బాలనాగమ్మ’ కి తీసుకువెళ్లారు.నేను 198086 లో ప్రసిద్ధ హిందీకవి కీ.శే.గోపాల్దాస్ ‘నీరజ్’ గారి గీతాల మీద ఔరంగాబాద్‌లోని మరాఠ్వాడా విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ చేశాను. మామయ్య నాకొక దారిదీపం. నేను 6సంööలు కష్టపడి గుడిపాటి వెంకటచలంగారి జీవితచరిత్రను ‘రమదేసే రమణాశ్రమ్ తక్’ అన్న పేరన 1300 పేజీలు రాశాను. 2015 న ‘సాహిత్య సేవాసమితి’ (హిందీ సంస్థ) ఆధ్వర్యంలో పెద్దఎత్తున పుస్తక ఆవిష్కరణ జరిగింది. మామయ్యకి తెలిసిన పెద్దపెద్ధ రచయితలు, చలం అభిమానులు వచ్చారు. ఆరోజు ప్రసంగించిన హిందీ రచయిత్రి డా.అహల్యామిశ్రా (ఈ మధ్య ఆవిడ కాలంచేశారు.) ఆవిడ ‘బులంద్ ఆవాజ్’ అని మంచివక్త అని పొగిడారు.
మామయ్య ఒక విజ్ఞానఖని. తను చదివిన పుస్తకాల గురించి చెప్పేవారు. కమ్యూనిస్టు సిద్ధాంతాల గురించే కాదు, పౌరాణిక గ్రంథాలు రామాయణ, భారత, భాగవతాల గురించి చెప్పేవారు. వివిధ దృష్టి కోణాలతో ఎట్లా పరిశీలించాలో చెప్పేవారు. నాకు ‘అమ్మ’ నవల ఇచ్చారు.
మూడు నెలల క్రితం నా మనుమరాలు కావ్య, ఆమె భర్త సోయేష్ పూనా నుంచి హైదరాబాద్‌కి వచ్చారు. సోయేష్ చాలా చక్కగా ఉన్నాడని అన్నారు. డ్రాయింగ్ రూమ్‌లో వేద గ్రంథాలు బీరువాలో ఉన్నాయి. వాటిని చూసి సోయేష్ అంకుల్ మాకు వేదాల గురించి చెప్పరా అని అడిగాడు. ఆయన ఇంగ్లీషు, హిందీ, తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నా కొడుకు ప్రశాంత్, కోడలు రేణుక, అరుణ్ప్రసాద్, జయ, నేను వింటూ కూర్చున్నాము. అందరం ఎంతగానో ప్రభావితులమయ్యాం. సోయేష్ ఇల్లంతా చూశాడు. ఆ ఇల్లు అతడికి ఎంతో నచ్చింది. నేను, హిందీ కవి దేవాప్రసాద్, డా.శ్రీలక్ష్మీ ఆయన గేయ సంపుటి ‘జనం నుంచి జనంలోకి’ ని హిందీలో ‘జన్సే జన్మే’ అన్న శీర్షికన అనువదించాం. స్టేజీపైన పార్టీవాళ్లుఉన్నారు. వాళ్ల స్పీచ్లువిని మేంఅందరం ఎంతో ప్రభావితు లయ్యాం. వారా సంస్థకి 5 వేలు, మా ముగ్గురికి 5 వేల చొప్పున ఇచ్చారు.
మామయ్య తోటి అల్లుళ్లు ఐదుగురిని తమ్ముళ్లలా చూసేవారు. చనిపోయిన మా చిన్న చెల్లెలు వెంకటరమణ అంటే ఆయనకి ఎనలేని ప్రేమ. చెల్లెలు లక్ష్మీ ఆమె భర్త వేణుగోపాల్ అంటే ఎంతో అభిమానం. మామయ్యకు, మా చిన్నప్పటి నుంచి పిల్లలకు పిల్లల పుస్తకాలు ఇచ్చే అలవాటు ఉండేది. జానకి పిల్లలకు కూడా పుస్తకాలు ఇచ్చారు. ఆ పిల్లలు మామయ్యని ‘పుస్తకాల తాతయ్య’ అని అంటూ ఉంటారు. మా రెండోఅక్కయ్య లీలకి బీఏ తెలుగు చదివేటప్పుడు పద్యాలు నేర్పేవారు. వాటి అర్థంచెప్పేవారు. మూడో అక్కయ్య మాలతి ఆయన ప్రోత్సాహంతో రష్యన్భాష నేర్చుకుంది. మా తమ్ముడు సత్యప్రకాశ్రాసిన కవితలని ‘అభ్యుదయ’లో ప్రచురించి ఎంతోప్రోత్సహించారు.
మామయ్య ప్రోత్సాహంతో నేను తాపీ ధర్మారావుగారి పుస్తకాలను ‘ఇనుప కచ్చడాలు’, ‘దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు’? ‘పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు’ హిందీలోకి అనువదించాను. ప్రసాద్గారి పీహెచ్‌డీ సిద్ధాంతగ్రంథం ‘తాపీ ధర్మారావుజీవితంరచనలులో నుంచి 125 పేజీలు హిందీలోకి అనువదించాను. మొత్తం కలిపి ‘ప్రజనన తంత్ర తధా దైవీభావన’ అన్న పేరున అచ్చయింది.
మామయ్య తీసుకొచ్చిన ‘పొయెట్రీ వర్క్‌షాప్’ లోని తెలుగు పద్యాలను నేనే హిందీలోకి అనువదించాను. శ్రీ వెంకటేష్ దేవన్పల్లి (బెంగుళూరు, మరాఠీ రచయిత) కొన్నింటిని ఇంగ్లీషులోకి అనువదించారు. మామయ్య హిందీ, ఇంగ్లీషు చూశారు. పూర్తిచేసి ప్ఙ్లష్ చేయాలని నేను వెంకటేష్ అనుకున్నాము.మామయ్య ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. అందులో ఒక సంఘటన వింటే ఆయనలో ఉన్న హాస్య ప్రవృత్తి, ఎవరికైనా సరే మృదుమధురంగా జవ్ఙాచ్చే స్వభావం గురించి తెలుస్తాయి. ఆయన రోజూ చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి గుడి ముందరి నుంచి వెళ్లేవారు. కొందరు ప్రసాద్ నువ్వు గుడి ముందర నుంచే వెళ్తున్నావు కాబట్టి ఆ దేవుడి శక్తి నీకు లభిస్తోంది అని అనేవారు. ‘నాకు ఆయన ఏం శక్తి ఇస్తాడు. నేనే ఆ దారిన వెళ్తూ ఆయనకు శక్తిని ఇస్తూ వెళ్తున్నానని’ అని అన్నారు.
మామయ్యా! “మీరు మధ్యలో లేరు. మీరు నేర్పిన ఎథిక్స్ ప్రకారమే ఇంతకు ముందు నడిచాం. ఇక ముందూ నడుస్తాం.
డా॥ టి.సి. వసంత
ఒక భూమి, ఒక ఆకాశం, ఒక సముద్రం-ఏటుకూరి ప్రసాద్
- Advertisement -


