హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ పైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ), నాలుగు రాష్ట్రాలలో ఎనిమిది కొత్త శాఖలను ప్రారంభించడం ద్వారా తన దేశవ్యాప్త నెట్వర్క్ను 929 శాఖలకు విస్తరించింది. ఈ విస్తరణ, కీలక మార్కెట్లలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడంపై మరియు మెట్రోపాలిటన్, సెమీఅర్బన్ (అర్థపట్టణ), గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై బ్యాంకుకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. బ్యాంకు ప్రారంభించిన ఈ ఎనిమిది కొత్త శాఖలలో మూడు తమిళనాడులో, రెండు చొప్పున కర్ణాటక మరియు తెలంగాణలలో, ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. తమిళనాడులో చెన్నైృచూలై, తిరుకళుకుండ్రం, తిరుచిరాపల్లిృవైయంపట్టిలలో: కర్ణాటకలో బెంగళూరులోని నాగరాభావి, హులిమావులలో: తెలంగాణలో బాచుపల్లి, తాండూరులలో: అలాగే ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఈ కొత్త శాఖలు ఏర్పాటయ్యాయి. ఈ విస్తరణలో భాగంగా మెట్రోపాలిటన్ మార్కెట్లలో నాలుగు, సెమీ`అర్బన్ ప్రాంతాలలో మూడు, గ్రామీణ ప్రాంతంలో ఒక శాఖను ఏర్పాటు చేశారు. ఇది వివిధ భౌగోళిక ప్రాంతాల్లోని వినియోగదారులకు సేవలను అందించాలనే కేవీబీ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. తెలంగాణలో, బాచుపల్లి మరియు తాండూరులలో కొత్తగా ఏర్పాటు చేసిన శాఖలను స్థానిక ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. బాచుపల్లి శాఖను ప్రగతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డి. దయాకర్ రెడ్డి, బాచుపల్లిలోని ‘డాక్టర్ రంజితాస్ క్లినిక్’కు చెందిన డాక్టర్ రంజితా నాదెండ్ల కలిసి, సంప్రదాయబద్ధంగా ‘గాయత్రీ దీపం’ వెలిగించి ప్రారంభించారు.
కరూర్ వైశ్యా బ్యాంక్ నెట్వర్క్ విస్తరణ
- Advertisement -


