Homeవిశ్లేషణకార్పొరేట్ కబంధ హస్తాల్లో ఫోర్త ఎస్టేట్

కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఫోర్త ఎస్టేట్

- Advertisement -

ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాలపై నిలబడు తుంది. ఆ నాలుగో స్తంభాన్ని ఎడˆండ్ బర్క్క ఫోర్త ఎస్టేట్‌గా అభివర్ణించాడు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ప్రత్యక్ష అధికారాన్ని చలాయిస్తే, పత్రికారంగం ఆ మూడు వ్యవస్థలను నిలదీసే పరోక్ష అధికారం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1) (ఏ)లో భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రతిపత్తి కల్పించింది. ఇది వ్యక్తి హక్కు కాదు, ప్రజలకు నిజం తెలిసే హక్కు. సుప్రీంకోర్టు ఈ హక్కును విస్తృతం చేసింది. రొమేష్ థాపర్ 1950, బ్రిజ్ భూషణ్ 1950, సకల్ పేపర్స్‌ 1962, బెన్నెట్ కోల్మన్ 1973, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 1985 తీర్పుల్లో పత్రికా స్వేచ్ఛ లేకుండా ప్రజా స్వామ్యం లేదని చెప్పింది. ఆర్టికల్ 19(2)లోని పరిమితులు రాజ్యాంగ బద్ధంగా ఉండాలని తేల్చింది. ఇదే ఫోర్త ఎస్టేట్‌కు రక్షణ కవచం. కానీ ఆ కవచానికి నేడు చిల్లులు పడింది. పత్రికా స్వేచ్ఛ కార్పొరేట్ గోతిలోకి జారు తోంది. ఒకప్పుడు సంపాదకుడి పేరుతో నడిచిన పత్రికలు నేడు బోర్డు రూమ్ లోని షేర్ హోల్డర్ పేరుతో నడుస్తున్నాయి. జర్నలిజం మిషన్ నుండి కమీ షన్‌గా మారింది. వార్త ప్రజాసేవ నుండి ఉత్పత్తిగా మారింది. ఈ మార్పు నకు లెక్కలు సాక్ష్యం. అదానీ ఎన్‌డీటీవీని స్వాధీనం చేసు కున్నాక 200 మంది సీనియర్ జర్నలిస్టులు బయటకు వచ్చారు. రిలయన్స్‌ చేతిలో నెట్‌వర్క్ 18 పేరుతో 50కి పైగా ఛానెళ్లు ఉన్నాయి. టాప్ 10 ఛానెళ్ల టీఆర్‌పీలో 70 శాతం రెండు కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉందని న్యూస్ లాండ్రీ చెబుతోంది. అందుకే గోదీ మీడియా అనే పదం పుట్టింది. గోదీ అంటే ఒడి, ప్రభుత్వ ఒడిలో కూర్చున్న మీడియా. ప్రజా ఉద్యమాల్లో ఫోర్త ఎస్టేట్ రాజ్యం పక్షాన పనిచేయడం. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ధర్నా చేస్తే గోదీ మీడియా వారిని ఖలిస్తానీలు అని ముద్ర వేసింది. కార్మికులు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా సమ్మె చేస్తే సోమరిపోతులు అని చిత్రీకరించింది. ఫలితంగా ప్రజాఉద్యమాల్లో వచ్చే ప్రజాస్వామిక డిమాం డ్లను రాజ్యం అణచివేత, నిరÒం ధం, దమనకాండతో నెరవేర్చకుండా దాట వేస్తోంది. కార్పొరేట్‌లకు ఊడిగం చేస్తూ ప్రజల నెత్తిన శఠగోపం పెడుతోంది. దీనికి కొనసాగింపుగా, దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఫోర్త ఎస్టేట్ పాత్ర ప్రమాదకరంగా మారింది. ప్రజాభి ప్రాయాన్ని ప్రోది చేసే మీడియాగా ఉండటం లేదు. రాజ్యం, దాని అధిపతుల తప్పులను దాచేసి వారికి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేయడం సమాజానికి ప్రమాదకరం. అందుకే కారల్ మార్క్స్ ‘పత్రికలు పెట్టుబడిదారీ పుత్రికలు’ అన్నారు. పెట్టుబడిదారుడు తన ఫ్యాక్టరీలో కార్మికుడి శ్రమను దోచుకున్నట్లే, తన పత్రికలో జర్నలిస్టు కలాన్ని దోచుకుంటాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ప్రధాన పత్రికల పాత్రను చూస్తుంటే బాధ కలుగుతుంది. ఈ ఎన్నికల్లో అధికార పక్షం, ప్రతి పక్షం రెండూ కూడా ప్రజలను మోసం చేస్తున్నాయి. ఇద్దరూ కార్పొరేట్ అను కూల విధానాలే అమలు చేస్తున్నారు. ఒకరు ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియా అంటే, ఇంకొకరు అదే మాఫియాకు కొత్త పేరు పెట్టి కొనసాగిస్తు న్నారు. ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం కావాలి. కానీ ప్రజాపక్షం ఉన్న ప్రగతిశీల, అభ్యుదయ, కమ్యూనిస్టు శక్తులకు సరైన ప్రోత్సాహాన్ని ప్రధాన పత్రికలు ఇవ్వటం లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలు, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం.ఎల్)న్యూ డెమోక్రసీ, ఏం.ఎల్ వంటి పార్టీల అభ్య ర్థులు పేదల పక్షాన నిలబడి పోరాడుతున్నారు. వారి డిమాండ్లు స్పష్టం. అందరికీ విద్య ఉపాధి, ఔట్సోర్సింగ్ వ్యవస్థ రద్దు, 3.10 లక్షల కాంట్రాక్టు ఉద్యోగు లను పర్మినెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం, రైతులకు గిట్టు బాటు ధర, కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి. కానీ వారికి పత్రికల్లో చోటు లేదు. దీనికి కారణం కొన్ని మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీల ప్రతినిధులు ఎన్నికలలో ఇండిపెండెంట్ గుర్తుతో పోటీ చేయడం. రాష్ట్ర ఎన్నికల సంఘం రిజిస్టర్డ్ పార్టీలకు సాధారణ గుర్తు ఇవ్వకపోవడం వల్ల వారు కత్తెర, కాగడ వంటి స్వతంత్ర గుర్తులతో పోటీ చేస్తున్నారు. దీనిని సాకుగా చూపి ప్రధాన పత్రి కలు వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. వారి ప్రచారం, మేనిఫెస్టో, త్యాగాల చరిత్రను మరుగున పెడుతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎన్ని కల్లో పోటీలో ఉన్న ప్రతి వ్యక్తికి సమాన అవకాశం, సమప్రాధాన్యం ఇవ్వ డంలో పత్రికలు విఫలమవుతున్నాయి. ఆర్టికల్ 324 స్వేచ్ఛాయుత, నిష్పక్ష పాత ఎన్నికలను కోరుతోంది. స్వేచ్ఛాయుత ఎన్నికలు అంటే కేవలం పోలింగ్ బూత్‌లో స్వేచ్ఛ కాదు, వార్తా పత్రికల్లో కూడా స్వేచ్ఛ, సమాన స్థలం. కానీ ప్రధాన పత్రికలు అధికార, ప్రతిపక్ష కూటములకే పేజీలకు పేజీలు కేటా యిస్తూ, ప్రజాపక్షం ఉన్న అభ్యుదయ శక్తులను బహిష్కరిస్తు న్నాయి. ప్రపంచ స్థాయిలో భారత్ పరువు దిగజారడానికి ఇదే కారణం. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌ 2024లో భారత్ 161వ స్థానం. గౌరీలంకేష్ హత్యలు ఈ పతనానికి రక్తపు గుర్తులు. ఈ వ్యవస్థీకృత భయం వెనుక మనువాద, కార్పొరేట్ కబంధం ఉంది. ఆర్టికల్ 14, 15, 17లకు విరుద్ధం. ఈ అబద్ధపు తెరను తొలగించ గలిగేది యువత మాత్రమే. విప్లవం అంటే ఆలోచన, చైతన్యం విప్లవం. భగత్‌సింగ్ విప్లవం అంటే అన్యాయంపై తిరుగుబాటు అని రాశాడు. అంబే ద్కర్ రాజ్యాంగం అనే ఆయుధాన్ని ఇచ్చాడు. నేడు జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ యువత అదే బాటలో పోరాడుతోంది. ప్రగతిశీల శక్తులకు, ఇండిపెండెంట్ గుర్తుతో పోటీ చేస్తున్న, సమానత్వ సిద్ధాంతంతో పనిచేస్తున్న మార్క్సిస్ట్-లెనినిస్ట్, కమ్యూనిస్టు అభ్యర్థులకు స్థలం కల్పించి, వారి గొంతును ప్రజలకు చేర్చాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అడ్వకేట్, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా,
పౌర హక్కుల నేత. మొబైల్ : 9493861875

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు