ఇస్కా రాజేష్ బాబు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి సంస్థల కార్యకలాపాలకు భారత్ కీలక కేంద్రంగా ఎదుగుతోంది. గ్లోబల్ కేపబిలిటీ¡ సెంటర్స్ రంగం దేశ ఆర్థికాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలో 1,700కు పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాలు పరిశోధన, రూపకల్పన, సాఫ్ట్వేర్ అభివృద్ధి, డిజిటల్ పరివర్తన వంటి రంగాల్లో సేవలందిస్తున్నాయి. భారతదేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఒక మహత్తర విప్లవానికి కేంద్రంగా మారుతున్నాయి. భారతదేశంలో జీసీసీల మొత్తం ఆదాయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 10,000 కోట్ల డాలర్లకు (రూ.9.50 లక్షల కోట్లకు పైగా) చేరుకుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 1,800 నుండి 2,400 వరకు జీసీసీ కేంద్రాలు ఉన్నాయి. ఇవి దాదాపు 2.8 మిలియన్లకు (28 లక్షలు) పైగా నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో జీసీసీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను భారత్‌కు విస్తరించడంతో నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. పరిశోధన, అభివృద్ధి (ఆరఅండ్డీ), సాఫ్ట్వేర్ అభివృద్ధి, డిజిటల్ పరివర్తన వంటి విభాగాల్లోనూ భారత కేంద్రాల ప్రాధాన్యం పెరుగుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉద్యోగాలు అందుబాటులోకి రావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.
భారతదేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి సంస్థలు భారత్‌ను తమ సాంకేతిక, పరిశోధన, వ్యాపార కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మార్చుకుంటున్నాయి. దీంతో దేశంలో కొత్త ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో సుమారు 2.3 మిలియన్ల మంది జీసీసీ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. 2031 నాటికి ఈ సంఖ్య 3.7 మిలియన్లకు చేరవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విస్తరణతో కొత్తగా సుమారు 14 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు భారత్ అడ్డాగా మారింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశంలోని జీసీసీల మొత్తం ఆదాయం 10,000 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9.50 లక్షల కోట్లు) చేరువైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2024-25)లో జీసీసీల మొత్తం రెవెన్యూ 6,500 కోట్ల డాలర్లుగా నమోదైంది. దేశంలోని జీసీసీల సంఖ్య 2,000 మార్క్‌ను దాటింది. ఈ మార్చి చివరినాటికి 2,117కు చేరుకుంది. వాటిల్లో 23.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జీసీసీల 32 శాతం పెరిగింది. ఫోర్Òస్ గ్లోబల్ 2000 కంపెనీల్లో 506 ఇప్పటికే భారత్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయి. దేశంలోని 1,200కు పైగా జీసీసీలు కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లర్నింగ్ (ఎంఎల్) సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. అందులో 250కి పైగా ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను నిర్వహిస్తున్నాయి. దేశంలో 2.5 లక్షలకు పైగా ఏఐ, ఎంఎల్ నిపుణులున్నారు. ప్రపంచ జీసీసీల్లో పనిచేస్తున్న ఏఐ నిపుణుల్లో 28 శాతానికి సమానమిది. 1080 సెంటర్లతో బెంగళూరు జీసీసీలకు కేంద్రంగా ఉంది. మొత్తం జీసీసీల్లో మూడో వంతు వాటా ఇది. ఫైనాన్షియల్ సర్వీసెస్ జీసీసీలకు హైదరాబాద్ హాట్‌స్పాట్‌గా ఉంది. గత ఏడాది సగం జీసీసీలు హైదరాబాద్‌నే ఎంచుకున్నాయి. పుణె, ఎన్సీఆర్, చెన్నై ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది ఏర్పాటైన సెంటర్లలో 5 కోయంబత్తూర్, అహ్మదాబాద్, కోల్‌కతా, వడోదరా, కొచ్చి వంటి నగరాలను ఎంచుకున్నాయి. 2028 నాటికి మనదేశంలో జీసీసీల సంఖ్య 2,100 కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం సగటున 150 కొత్త కేంద్రాలు ఏర్పాటవుతాయని అంచనా. ఈ రంగంలో వచ్చే కొన్నేళ్ల పాటు ఏటా 8% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. బెంగళూరులో 487, హైదరాబాద్‌లో 273 జీసీసీ కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్ ఎంతో వేగంగా జీసీసీలకు కేంద్ర స్థానంగా మారుతోంది. చెన్నైలో 178 జీసీసీలు ఉన్నాయి. మనదేశంలోని మొత్తం జీసీసీ కేంద్రాల్లో చెన్నై వాటా 11%గా ఉంది.
భారత్‌లో జీసీసీలు ఏర్పాటు చేసిన కంపెనీల్లో 63 అమెరికాకు చెందినవే. యూరప్, యూకే (21), ఏపీఏసీ(9) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇతర దేశాలకు చెందిన కంపెనీలÖ జీసీసీల ఏర్పాటుకు భారత్‌వైపు చూస్తున్నాయి. ప్రస్తుతం జర్మనీకి చెందిన 105 కంపెనీలు భారత్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయి. డెన్మార్క్, బెల్జియం, లక్సెంబర్గ సంస్థలు కూడా భారత్‌లో తమ సెంటర్లను విస్తరిస్తున్నాయి. బహుళ జాతి కంపెనీలు తమ జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)లు ఏర్పాటు చేయడానికి భారత్ వైపే ఎక్కువగా చూస్తున్నాయి.
ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటైన జీసీసీల్లో సగానికి పైగా భారత్‌లో ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. అందులోనూ అత్యధికం దక్షిణాది నగరాల్లోనే ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే కేంద్రాలనూ దక్షిణాది నగరాలు అధికంగా ఆకర్షిస్తున్నాయి. దీనిలో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా, రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. తర్వాత చెన్నై కనిపిస్తున్నాయి. జీసీసీలు ఏర్పాటు చేయాలంటే అందుకు అనువైన భవనాలు అవసరం. నిర్వహణ ఖర్చులు వీలైనంత తక్కువ ఉండే ప్రాంతాలు, అన్నింటికీ మించి మానవ వనరుల లభ్యత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలు నిర్ణయం తీసుకుంటాయి. వీటితో పాటు సంబంధిత కంపెనీ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న రంగానికి సంబంధించిన పరిశ్రమలు చుట్టుపక్క ప్రదేశాల్లో ఉండడమూ అవసరమే. ఐటీ కంపెనీలకు బెంగళూరు-హైదరాబాద్, ఫార్మా-బయోటెక్‌కు హైదరాబాద్, ఆటోమొబైల్-ఇంజినీరింగ్ రంగాలకు చెన్నై ఎంతో పేరు సంపాదించాయి. ఫార్మా-బయోటెక్ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు జీసీసీలను ఏర్పాటుచేయాలంటే సహజంగానే హైదరాబాద్ అగ్రస్థానంలో కనిపిస్తుంది.
సీనియర్ జర్నలిస్ట్,
సెల్ :93973 99298


