Homeవ్యాపారంజియో హాట్స్టార్‌లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’ టైలర్

జియో హాట్స్టార్‌లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’ టైలర్

- Advertisement -

ముంబై: ప్రేక్షకులను మరోసారి సెయింట్ థెరెసా క్యాంపస్లోకి తీసుకెళ్లబోతూ, జియో హాట్స్టార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’ టైలర్‌ను విడుదల చేసింది. ఓ అనుమానాస్పద మరణం చుట్టూ సాగే ఈ సిరీస్‌లో ఆశయాలు, పోటీ, హత్య మిస్టరీ కలగలిసి ఉంటాయి. సెయింట్ థెరెసా క్యాంపస్‌లో అందరి దృష్టిని ఆకర్షించే విద్యార్థిని ఆయేషా మాలిక్ (షనాయా కపూర్) మృతదేహం లభ్యమైనప్పుడు, అది ప్రమాదవశాత్తూ జరిగిన మరణమని ఆమె కవల సోదరి అదితి (షనాయా కపూర్) అంగీకరించదు. నిజాన్ని వెలికితీయాలని నిర్ణయించుకున్న అదితి, పాఠశాలలోకి ప్రవేశించి తీవ్ర పోటీతో కూడిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ పోటీలో పాల్గొంటుంది. అయితే, తన సోదరికి అత్యంత సన్నిహితులైన వారే ఆమెకు గట్టి పోటీదారులని తెలుసుకుంటుంది. హంతకుడిని కనిపెట్టాలంటే ఆమె ఏదైనా చేయాల్సిందే… పోటీలో ప్రవేశించాలి, నిలదొక్కుకోవాలి, గెలవాలి. అగ్రస్థానానికి చేరుకోవాలనే తపన వ్యసనంగా మారుతున్న, ఆశయం మనుషులను హద్దులు దాటించేలా చేస్తున్న తరానికి ఈ సిరీస్ అద్దం పడుతుంది. ఈ క్రమంలోనే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’ ఓ ప్రశ్ననూ సంధిస్తుంది… గెలవడానికి మీరు ఎంత త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఒరిజినల్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ విజయం సాధించాలనే కల గురించి చెబితే.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’ గెలుపు కోసం చెల్లించాల్సిన మూల్యం గురించి చెబుతుంది. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్‌కు రీమా మాయా దర్శకత్వం వహించారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’ సిరీస్ నవంబర్ 13 నుంచి జియో హాట్స్టార్‌లో స్రీట్మింగ్ కానుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు