హైదరాబాద్: భారతదేశపు ప్రముఖ ఓమ్నిఛానల్ ఫర్నిచర్, హోమ్ మార్కెట్‌ప్లేస్ అయిన పెప్పర్ఫై, జూబ్లీ హిల్స్‌లో ఒక కొత్త స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా హైదరాబాద్‌లో తన ఉనికిని విస్తరించింది. దీనితో దక్షిణ భారతదేశంలో తన ఆఫ్లైన్ ఉనికిని మరియు ఓమ్నిఛానల్ కస్టమర్ అనుభవాన్ని మరింత బలోపేతం చేసుకుంది. జూబ్లీ హిల్స్‌లోని జవహర్ కాలనీ, రోడ్ నెం. 36, అపురూప టవర్స్‌లో ఉన్న ఈ 1,700 చదరపు అడుగుల స్టోర్‌ను వెంకట లలిత్ వంశీ, శ్రీనిత్ మడపతి భాగస్వామ్యంతో ప్రారంభించారు. ఈ కొత్త జూబ్లీ హిల్స్ స్టూడియో, ప్రముఖ బ్రాండ్‌ల నుండి విస్తృత శ్రేణి ఫర్నిచర్, పరుపులు, గృహాలంకరణ, జీవనశైలి ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఆలోచనాత్మకంగా రూపొందించిన ప్రదర్శనల ద్వారా వినియోగదారులను ఉత్తేజపరిచేలా డిజైన్ చేయబడిన ఈ స్టూడియో, వినియోగదారులు తమ ప్రత్యేక శైలి, అవసరాలను ప్రతిబింబించే ప్రదేశాలను సృష్టించుకోవడంలో సహాయపడటానికి, పెప్పర్ఫై డిజైన్ కన్సల్టెంట్ల నుండి నిపుణుల మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తుంది. జూబ్లీ హిల్స్ స్టోర్, పెప్పర్ఫై డిజిటల్ కేటలాగ్ సౌలభ్యాన్ని స్టోర్‌లోని అనుభవంతో మిళితం చేసేలా రూపొందింది. ఇది వినియోగదారులు విస్తృతమైన ఆన్‌లైన్ శ్రేణిని యాక్సెస్ చేస్తూనే, ఉత్పత్తులను భౌతికంగా అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది. పెప్పర్ఫై ప్రస్తుతం భారతదేశంలోని 90కి పైగా నగరాల్లో 150కి పైగా స్టోర్లలో తన ఉనికిని కలిగి ఉంది. ఈ సంస్థ తన విస్తరణను బలోపేతం చేసుకోవడానికి, వివిధ మార్కెట్‌లలో మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి, స్థానిక పారిశ్రామికవేత్తలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటూ, ఫ్రాంచైజీ`ఆధారిత నమూనా ద్వారా తన ఆఫ్లైన్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోందని పెప్పర్ఫై చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హుస్సేన్ కేస్యూరి తెలిపారు.


