విశాలాంధ్ర – కాకినాడ : ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు జేఎన్టీయూ కాకినాడ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల్లో తనిఖీలు చేపట్టామని ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌లో 62 వేల సీట్లు అందుబాటులో ఉండే అవకాశముందని చెప్పారు. 106 ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు చేశామన్నారు. ఫార్మసీలో 34 కళాశాలలకుగాను సుమారు 3,950 సీట్లు, ఎంబీఏ, ఎంసీఏకు సంబంధించి 9 కళాశాలలకు 16,068 సీట్లు అందుబాటులో ఉండే అవకాశముందని తెలిపారు. వెబ్ ఆప్షన్ల నమోదు కోసం ఈనెల 18 వరకు అవకాశం ఉందని శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాలు గమనించి తమకు నచ్చిన కోర్సు, కళాశాలలో చేరేందుకు సరైన ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు.
జేఎన్టీయూకే పరిధిలో 62 వేల ఇంజినీరింగ్ సీట్లు
- Advertisement -
RELATED ARTICLES


