విశాలాంధ్ర – హైదరాబాద్: డీప్‌టెక్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొ న్నారు. ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పులు తీసుకొచ్చే ఉత్పత్తులు, సేవలుగా వాటిని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే సాంకేతిక ఆవిష్కరణలకు నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు. బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో బుధవారం ఎఫ్ ఐసీఐసీఐ ఏ100 వేడుకలు, తెలంగాణ డీప్‌టెక్ లీడర్ షిప్ సమ్మిట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భట్టి మాట్లాడుతూ… 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనలో సాంకేతిక ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. తెలంగాణను పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా తీరి Ìదిద్దేందుకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలు, విధానాలతో ముందుకు సాగుతోందన్నారు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఐటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలు రాష్ట్రానికి ప్రధాన బలమని చెప్పారు. సాఫ్ట్వేర్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఇంజినీరింగ్ వంటి విభిన్న రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని, ఈ సామర్థ్యాలన్నింటినీ సమన్వయం చేయడం ద్వారా తెలంగాణ డీప్‌టెక్ రంగంలో ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు వేదికగా ఎదగగలదని అభిలషించారు. ఇంధన రంగంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగం, విద్యుత్ నిల్వ సాంకేతి కత, విద్యుత్ సరఫరా వ్యవస్థల పనితీరు మెరుగుదల వంటి అంశాల్లో డీప్‌టెక్ ఆవిష్కరణలకు విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. వైద్య రంగంలో వ్యాధులను ముందుగానే గుర్తించే నిర్ధారణ పరికరాలు, వ్యవసాయ రంగంలో రైతులకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి, దిగుబడులు పెంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా పెద్ద పరిశోధనా విభాగాలు ఏర్పాటు చేయకుండానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా సహకారం అందించాలని పేర్కొన్నారు. పెట్టుబడు లకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యా నికి పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. ఎఫ్ ఐసీఐసీఐ 1927లో దేశ స్వాతంత్ర్య పోరాట సమయంలోనే స్థాపించబడిందని, భారతీయ పారిశ్రా మిక రంగం అభివృద్ధికి వందేళ్లుగా విశేష సేవలందిస్తోందని భట్టి ప్రశం సించారు. భారతీయ పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రపంచస్థాయి సంస్థలుగా ఎదిగేందుకు ఎఫ్ ఐసీసీఐ మరింత చొరవ తీసుకోవాలని కోరారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరై రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తొలుత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి విచ్చేసిన భట్టికి… ఎఫ్ ఐసీసీఐ చైర్మన్ వీవీఆర్ రాజు, ఎఫ్టిసీసీఐ అధ్యక్షురాలు కేకే మహేశ్వరి, ఎఫ్ఐసీసీఐ మాజీ అధ్యక్షురాలు, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి ఘన స్వాగతం పలికారు.
డీప్‌టెక్ ఆవిష్కరణలు ప్రోత్సహిస్తాం
- Advertisement -
RELATED ARTICLES


