Homeక్రీడలుతొలి టీ20 మనదే

తొలి టీ20 మనదే

- Advertisement -

ఉత్కంఠ పోరులో కివీస్‌పై భారత్ ఘన విజయం
చెలరేగిన శాంసన్, నమన్ ధిర్
క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరిస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం క్రైస్ట్చర్చ్ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్‌ అరÆ శతకంతో చెలరేగాడు. కేవలం 40 బంతుల్లోనే 8 ఫోర్లు , 3 సికస్ర్లతో 82 పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ 45, జాకోబ్స్‌ 31, డేరిల్ మిచెల్ 28 పరుగులతో రాణించారు. 226 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ (67: 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లు) విజృంభించాడు. కేవలం 23 బంతుల్లోనే అరÆ శతకం సాధించి బలమైన పునాది వేశాడు. ఆఖర్‌లో నమన్ ధిర్ (42: 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు), శ్రేయస్ అయ్యర్ (42: 28 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స్లు) దూకుడుగా ఆడి జట్టుకు విజయం అందించారు. అభిషేక్ శర్మ (29: 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు), అక్షర్ పటేల్ (24: 14 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) విలువైన పరుగులు చేశారు. తిలక్ వర్మ (6), ఇషాన్ కిషన్ (1) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో బ్రాస్వెల్ 2, శాంట్నర్ 2, ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే చెరో వికెట్ తీశారు. అరÆ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. శనివారం ఇదే వేదికపై రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
దంచేసిన ఫిలిప్స్‌… ఇబ్బంది పడిన భువీ
దాదాపు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన భువనేశ్వర్ కుమార్ (Bhuvneswar Kumar) తొలి ఓవర్‌ను అద్భుతంగా వేశాడు. కానీ, తన స్పెల్లో మిగతా ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించాడు. 4 ఓవర్లలో 49 పరుగుల ఇచ్చి వికెట్ లేకుండా కోటా ముగించాడు. టిమ్ సీఫర్ట్ (24), ఫిన్ అలెన్ (45) దూకుడు దెబ్బకు భువీతోపాటు అర్üదీప్ పవర్ ప్లేలో భారీగానే పరుగులు ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు