Homeవిశ్లేషణదారి తప్పిన తెలుగు సినిమా

దారి తప్పిన తెలుగు సినిమా

- Advertisement -

పి.పి.శాస్త్రి

సినిమా ఒక శక్తివంతమైన మాధ్యమం. మూకీ నుంచి టాకీ వరకూ సాగిన సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. వాటిల్లో కొన్ని మానవ జీవితంలో ఉండే అనేక సంఘటనలు, ఘర్షణలు, భావో ద్వేగాలు, బాధలు, కష్టాలు, అనుభవాలు మొదలైనవి కథాంశంగా స్పృశిస్తూ ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. వారికి మనోస్థైర్యం కలిగించాయి. మరికొన్ని సినిమాలు సామాజిక అంశాలను తీసుకొని ప్రేక్షకులకు సమాజం పట్ల అవగాహన కల్పించాయి. ఇంకొన్ని సిని మాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మన తెలుగు సినిమాలకు వస్తే ప్రతి దశాబ్దం తరువాత ట్రెండ్ మార్చుకుంది. 1950 నుంచి 1960 తెలుగు సినిమాలు మన పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా నీతిని ప్రభోదిస్తూ ఎక్కువగా వచ్చాయి. 1960 నుంచి 1970 వరకూ తెలుగు సినిమాలు పవిత్ర ప్రేమ, విరహం, విఫలప్రేమ, వంటి జోనర్ల లోనూ, మరో ప్రక్క జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాలు వచ్చాయి. 1970 నుండి 1980 వరకూ జానపద, భక్తి సినిమాలతో పాటు తెలుగు సినిమాలు హీరో, హీరోయిన్ చుట్టూ ప్రేమ, సైడు కామెడీ పాత్రలు, విలన్తో హీరో స్టంట్స్‌ ఒకే రకమైన కథాంశంతో సినిమాల ట్రెండ్ మొదలైంది. 1980 నుంచి 1990 వరకూ వచ్చిన సినిమాలలో శంకరాభరణం (1980) సాగర సంగమం (1983) మయమూరి (1985) స్వాతి ముత్యం (1986) అంజలి (1990) జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) వంటి క్లాసిక్ సినిమాలతో పాటు హీరో ఓరి యంటెడ్ సినిమాలు కూడా వచ్చాయి. 1990 నుంచి 2000 దశాబ్దంలో సోషియో ఫాంటసీ చిత్రం ఆదిత్య 369 (1991) పౌరాణిక చిత్రం శ్రీకృష్ణార్జున యుద్ధం కూడా వచ్చింది. 2000 నుండి 2010 వరకూ దశాబ్దంలో దాదాపు అన్ని తెలుగు సినిమాలు ప్రేమకథలతోనే వచ్చాయి. 2010 నుంచి 2020 దశాబ్దం ఒకటి రెండు ఫాంటసీ లేదా సామాజిక అంశాలు స్పృశించినా, బ్యాక్ గ్రౌండ్ కథాంశం ప్రేమ, వినోదం మాత్రమే. 2021 నుంచి 2026 వరకు వచ్చిన సినిమాలలో రెండు,మూడు సినిమాలు సామాజిక అంశాలను ఎత్తుకున్నా ప్రజలను ప్రభావితం చేసేంతగా లేవు. మిగిలిన సినిమాలు ప్రేమకథలు మాత్రమే. 1950`1980 వరకు మన తెలుగు సినిమా సామాజిక బాధ్యతతో వ్యవహరించింది. సినిమా ద్వారా ప్రేక్షకులను, వారి జీవితాలను ప్రభావితం చేస్తూ, ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. చాలా వరకూ సమాజానికి ఉపయోగపడింది, సహాయపడింది. తరువాత దశాబ్దాలలో తెలుగు సినిమా వినోదం, హాస్యం, డాన్స్‌, యాక్షన్, ఫైట్స్‌, ప్రాముఖ్యత ఇస్తూ, ఏ జోనర్‌లో తీసినా యువతీయువకుల మధ్య ప్రేమ బ్యాక్ గ్రౌండ్ కథతో సాగింది. ఇంకా పూర్తిగా వ్యాపార దృక్పథంతో పెట్టుబడి పెంచుకుంటూ, కోట్లకు పడగలెత్తి, ఆ పెట్టుబడి మీద లాభాల కోసం తెలుగు సినిమా సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరించింది. ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలిగి, సమాజానికి ఉపయోగపడే దిశగా కృషి చేయడానికి అవకాశం ఉన్న ఒక శక్తివంతమైన మాధ్యమం ఈ రకంగా సమాజానికి దూరంగా, లాభాపేక్షతో సమాజద్రోహిగా తయా రయ్యింది. అడపాదడపా కొన్ని సందేశాత్మక సినిమాలు వచ్చినా, కమర్షి యల్ సినిమాల (కార్పోరేట్ కంపెనీల లాగా) ముందు నిలబడలేక పోతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, కమ ర్షియల్ సినిమాల పేరుతో పెద్ద సినిమా ఇండస్ట్రీ‌ని సమాజానికి ఉప యోగపడకుండా చేసేసారు. ప్రజల జీవితాలకు ఉపయోగకరంగా ఉండాల్సిన ఒక ముఖ్యమైన మాధ్యమం ప్రజాపక్షం కాకుండాపోవడం క్షమించరాని నేరం. “కళ కళ కోసం కాదు ప్రజల కోసం” అని నిన దిస్తూ ఏర్పడిన అరసం, విరసం, జనసాహితి, ప్రజా నాట్యమండలి, జననాట్యమండలి మొదలైన సంస్థలు సినిమా మాధ్యమాన్ని సంస్కరించే ప్రయత్నం చేయలేక పూర్తిగా విస్మరించాయి. ఆ రకంగా సినిమా సమా జానికి, సమాజ వికాసానికి, శ్రేయస్సుకు కాకుండా దూరంగా జరిగి పోయింది. సినిమా రంగంలో వస్తున్న యువత కూడా అదే ఒరవడిలో కొట్టుకుపోతూ, ప్రేమ జోనర్లోనే సినిమా తియ్యడానికి ప్రయత్నం చేస్తూ, పెద్ద సినిమాలతో పోటీ పడలేక ఇబ్బందులు పడుతున్నారు. సినిమా కేవలం వినోదం మాత్రమే అనే భావన సరైనది కాదు. ఇతర అనేక కళారంగాలలానే సినిమా కూడా ఒక సామాజిక ప్రయోజనం ఉండవలసిన రంగమే. సమాజ వికాసానికి, సామాజిక చైతన్యానికి, సాంస్కృతిక విలువలకు, సినిమా మాధ్యమం నిలబడవలసిన చారిత్రక అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం, పెట్టుబడిదారుల కోసం, లాభాల కోసం, సినిమా పనిచేయడం దేశ ద్రోహం కన్నా తీవ్రమైన పరిణామం. దీనిని సంస్కరించుకోవలసిన బాధ్యత ప్రజలది, ప్రేక్షకులది. ముఖ్యంగా అభ్యుదయ కళా సంఘాలది.
ఏలూరు, ఫోన్ : 9885286643

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు