Homeవ్యాపారం’ది ఆరట్ ఆఫ్ కంజీవరం’ స్ఫూర్తితో పి ఎన్ రావు నూతన కలెక్షన్ల ఆవిష్కరణ

’ది ఆరట్ ఆఫ్ కంజీవరం’ స్ఫూర్తితో పి ఎన్ రావు నూతన కలెక్షన్ల ఆవిష్కరణ

- Advertisement -

బెంగళూరు: 100 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రముఖ డిజైన్ బ్రాండ్ ‘పి ఎన్ రావు ఫైన్ సూట్స్‌’ ఈ రోజు “వీవ్స్‌ ఆఫ్ లెగసీ` టైమ్లెస్ ఆరట్ ఆఫ్ ది కంజీవరం” పేరుతో వినూత్న మాస్టర్పీస్ కలెక్షన్‌ను ప్రారంభించింది. పట్టు చీరల రాణిగా ప్రసిద్ధి చెందిన కంజీవరం చీరల పురిటిగడ్డ, విశిష్టమైన ఆలయ శిల్పకళకు నిలయమైన తమిళనాడులోని కాంచీపురం నగరం నుండి ఈ కలెక్షన్ స్ఫూర్తి పొందింది. కంజీవరం కళలోని సంక్లిష్టమైన డిజైన్‌లు, సాంస్కృతిక విశిష్టతను పురుషుల ఆధునిక దుస్తులకు జోడిస్తూ, సాంప్రదాయక వారసత్వాన్ని నేటి ఆధునిక పవర్ సూటింగ్ శైలితో పి ఎన్ రావు అద్భుతంగా సమ్మేళనం చేసింది. ఈ నూతన సిరీస్ ఆవిష్కరణ సందర్భంగా ప్రత్యక్ష కర్ణాటక సంగీత కచేరీ నడుమ ప్రత్యేక ఫ్యాషన్ షోను నిర్వహించారు. 1923లో ప్రారంభమైన పి ఎన్ రావు సంస్థను ప్రస్తుతం మూడో తరం నిర్వాహకులు ఎంతో జాగ్రత్తగా, నైపుణ్యంతో ముందుకు నడిపిస్తున్నారు. ‘వీవ్స్‌ ఆఫ్ లెగసీ’ ఆవిష్కరణతో ఈ సంస్థ తన ప్రయాణంలో ఒక నూతన అధ్యాయంలోకి అడుగుపెట్టింది. డిజైన్‌లకు ప్రాధాన్యత ఇస్తూ, తమ మూలాలను కాపాడుకుంటూనే నవీన దృక్పథంతో ఈ కలెక్షన్‌ను తీర్చిదిద్దింది. ‘వీవ్స్‌ ఆఫ్ లెగసీ’ కలెక్షన్ రూపకల్పన వెనుక దక్షిణ భారత దృశ్య కావ్యాలు, సంస్కృతి పట్ల ఉన్న గాఢమైన అభిమానం దాగి ఉంది. కంజీవరం కళాత్మకత నుండి స్ఫూర్తి పొంది, ఈ ప్రాంత ఆలయ వాస్తుశిల్పం, శిల్పకళలోని విలక్షణమైన రూపాకారాలు (ద్రవిడ మోటిఫ్లు), కంటికి విందుగొలిపే రంగులు, క్లిష్టమైన డిజైన్‌లను ఈ వస్త్ర శ్రేణిలో పొందుపరిచారు. శతాబ్దాల నాటి ఆలయ శిల్పాలలో కనిపించే యాళి, నెమలి, తామర, ఏనుగులు మరియు క్లిష్టమైన అలంకారాలను ఆధునిక పురుషుల ఫ్యాషన్ దృక్కోణంలో పునరావిష్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు