Homeసంపాదకీయంనిరసన అంటే ఎంత భయమో!

నిరసన అంటే ఎంత భయమో!

- Advertisement -

ప్రభుత్వ భద్రతకు ముప్పు ఎదురైనప్పుడల్లా భద్రతా దళా లను ముందుకు తోస్తూ ఉంటుంది. కాక్రోచ్ జనతా పార్టీ శని వారం నాడు దిల్లీ చలో పిలుపు ఇచ్చిన తరవాత మోదీ సర్కారు వెన్నులో ఒణుకు పుడ్తోంది. దిల్లీ చలో కార్యక్రమాన్ని ఎలాగైనా విఫలం చేయడానికి మోదీ ప్రభుత్వం మొత్తం దిల్లీని దిగ్బంధం చేసింది. 23,000 భద్రతా దళాలను మోహరించింది. ప్రధాన వీధుల్లో ఎక్కడ చూసినా సి.ఆర్.పి.ఎఫ్, సి.ఐ.ఎస్.ఎఫ్., ఇండో టిబెటన్ సరిహద్దు దళాల వారే కనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న పట్టుమని పది మంది మాజీ ఐ.ఎ.ఎస్. అధికారులు ఎన్నికల కమిషన్ ప్రధానాధికారిని కలవాలని ప్రయత్నిస్తే కేంద్ర హోం మంత్రి అయిదు వేల భద్రతా దళాలను రంగంలోకి దింపారు. కాక్రోచ్ జనతా పార్టీ శనివారం జంతర్‌మంతర్‌కు తరలి రావాలని, ఇందులో దేశమంతటి వారూ పాల్గొనాలని పిలుపు ఇచ్చింది. అంతే మోదీ ప్రభుత్వ వెన్ను నిటారుగా నిలబడడం మానేసింది. భద్రతా దళాల మీద ఆధారపడుతోంది. నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కు. దీనికి నిజానికి ప్రభుత్వ అనుమతితో పనే లేదు. పైగా ప్రత్యేకంగా నిరసన ప్రదర్శన కోసమే ఉద్దేశించిన జంతర్‌మంతర్‌లో ప్రదర్శన చేయడానికి ప్రభుత్వ అనుమతితో పనేలేదు. కానీ దిల్లీ అంతటా పసుపుపచ్చని బ్యారికేడ్లే దర్శనం ఇస్తున్నాయి. ఇది ప్రభు త్వంలో గూడు కట్టుకున్న భయానికి సంకేతం. ప్రభుత్వం ప్రమాదంలో పడినప్పుడల్లా ప్రభుత్వమే హింసను ఆశ్రయిస్తుంది. కానీ భద్రతా రక్షణ దళాల రక్ష± కవచం ఏ ప్రభుత్వాన్ని అయినా కాపాడిన దాఖ లాలే లేవు. ఇప్పుడు సమస్య ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కానేకాదు. పరిస్థితి ఆ పరిధి దాటి మోదీ ప్రభుత్వ మెడకు క్రమంగా ఉచ్చు బిగుస్తోంది. ఈ పరిస్థితికి ప్రతిపక్ష పార్టీనో, కాక్రోచ్ జనతా పార్టీనో, ఆందోళనకు దిగిన జనసామాన్యమో మాత్రమే కారణం కాదు. మోదీ ప్రభుత్వం మీద, బూటకపు వాగ్దానాల మీద జనానికి భ్రమలు తొలగిపోతున్నాయి. గత వారం నుంచి జరుగు తున్న పరిణామాలను గమనిస్తే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమస్యను రాజకీయ పద్ధతుల్లో ఎదుర్కోకుండా బలప్రయో గంతో అణచివేయాలని చూస్తున్నారు. ఈ బలప్రయోగ రీతి జులైలో ఉన్నట్టుగా లేదు. పోలీసులు ఈ మధ్య విచ్చలవిడిగా లాఠీచార్జీలు చేయడం లేదు. బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం లేదు. కానీ భారీ సంఖ్యలో భద్రతా దళాలను మోహరించి జనాన్ని భయపెట్టాలని చూస్తున్నారు. అసలు భయం వారిలోనే గూడు కట్టుకుంది. సరిహద్దు భద్రతా దళాలు దిల్లీలో విహరిస్తున్నాయంటే మన సరిహద్దులు దిల్లీ దాకా కుంచించుకుపోయాయనుకోవాలా! శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీతో సహా దాదాపు 300 మంది ఎంపీలు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ రోడ్డెక్కితే భద్రతా దళాలు వారిని బలవంతంగా ఆపాయి. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో సహా అనేక మంది ఎంపీలను, ఇతర ప్రతిపక్ష నాయకులను ఏవో మూటలను విసిరేసినట్టుగా బస్సులోకి విసిరేసి అక్కడి నుంచి తరలించుకుపోయారు. శనివారం దిల్లీ చలో కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యార్థి నాయకులను, సామాజిక కార్యకర్తలను, రాజకీయ నాయ కులను దిల్లీ చేరకుండా ఎక్కడికకక్కడ ఆపేశారు. దిల్లీ వస్తున్న వారిని బలవంతంగా రైళ్లతో సహా ఇతర వాహనాల నుంచి కిందకు లాగేశారు. కొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. మరికొందరిని అపహరించారు. బీజేపీ ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారిపోయిన దిల్లీ పోలీసులు వీధివీధికి తిరిగి విద్యార్థులను, యువతను బెదిరిస్తున్నారు. హాస్టళ్లు, కడకు హోటల్ గదులను కూడా జల్లెడపడ్తున్నారు. ఇంతకు ముందు ఆందోళన చేసిన వారిని వెతికి పట్టుకుంటున్నారు. పరిపాల నను నిర్వహించడంలో మోదీ, అమిత్‌షా ఘోరంగా విఫలమయ్యారు. వారికి ఎదురవుతున్న రాజకీయ సవాలును భద్రతకు ముప్పుగా చిత్రి స్తున్నారు. ఆ ఇద్దరు “మహా నేతల”కు ఇంగిత జ్ఞానం సంపూర్ణంగా హరించుకుపోయినట్టుంది. గద్దె కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడడంతో ఆగకుండా అన్ని అడ్డదార్లూ తొక్కుతున్నారు. నిరసన తెలియజేయడాన్నే మహాపాపంగా చిత్రీకరిస్తున్నారు. ఈ అంశం శుక్రవారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. సహజంగానే సుప్రీంకోర్టు అటూ ఇటూ కాని ఆదేశాలు జారీ చేసింది. నిరసన జనం హక్కైన మాట నిజమేగానీ పరిస్థితిని అదుపు చేయడం ఎలా అని ప్రధాన న్యాయ మూర్తి సూర్యకాంత్ నాయకత్వంలోని బెంచి తెగని మీమాంస లో పడి పోయింది. పరిస్థితిని అదుపు చేయడం ప్రభుత్వ బాధ్యత అయితే అయిఉండొచ్చు. కానీ నిరసన తెలియజేయడం పౌరుల ప్రాథమిక హక్కు. ఎలాగైనా సరే దీనిని పరిరక్షించాలన్న ధ్యాసే సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో పూజ్యమైంది. శనివారం నాటి ప్రదర్శనను వమ్ము చేయడం కోసం దిల్లీలోని 57 మెట్రోస్టేషన్‌లను, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దిల్లీ చేరుకునే రైళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. మరీ ఇన్ని ఆంక్షలైతే ఎలా అని సుప్రీంకోర్టు అందరితో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేసిందే తప్ప నిరసనను ఆపడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, ప్రాథమిక హక్కులను కాలరాయడం అని అత్యున్నత న్యాయ స్థానానికి తట్టనే లేదు. రానురాను మోదీ ప్రభుత్వం కరక్కX øమైన నిరం కుశ ప్రభుత్వంగా మారుతోందని సుప్రీంకోర్టు ఎందుకు గ్రహించలేదో అంతుపట్టదు.ప్రజాస్వామ్య, శాంతియుత పద్ధతుల్లో జరిగే ప్రదర్శనలు ఎప్పుడూ దేశ భద్రతకు ముప్పు కలిగించలేదు. ఉప్పుసత్యాగ్రహం చేయడానికి, కిÇట్`ఇండియా ఉద్యమం చేయ డానికి మహాత్మాగాంధీ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదుగా! కానీ ఈ ప్రభుత్వం వలసవాద పాలనకన్నా హీనమైంది. ప్రతిపక్షాలను, నిరసన తెలియ జేసే వారిని, కడకు ఎంపీలను సైతం మోదీ ప్రభుత్వం శత్రువులుగా పరిగణిస్తోంది. రాజకీయ అంశాల ఆధారంగా నిరసన తెలియజేసిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ తదితరుల మీదే రోజుకో ఎఫ్.ఐ.ఆర్. నమోదుచేయడం నిరంకుశ చర్యే. వరసగా ప్రతిపక్షాలు నిరసన తెలియజేస్తూ ఉంటే వారిని పిలిచి మాట్లాడాలన్న విచక్షణే ప్రభుత్వానికి లేకుండాపోయింది. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహారాన్ని చక్కదిద్దే ఆలోచనే మోదీ సర్కారుకు లేదు. చట్టబద్ధమైన రాజకీయ అధికారానికి, బలప్రయోగానికి పొంతన ఎలా కుదురుతుందో! పాలనా సామర్థ్యం కోల్పోయినప్పుడు ప్రభుత్వాలు బలప్రయోగానికి దిగడం మామూలే. ప్రత్యర్థులను శత్రు వులుగా చూసే ఏ ప్రభుత్వమూ ఎక్కువ కాలం మనలేదు. ప్రతి పక్షాల వారిని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకోవడం అంటేనే ఎన్నికల కమిషన్, ప్రభుత్వం ఏదో దాచి పెడ్తున్నాయన్న అను మానాలకు అదనపు బలం చేకూరక తప్పదు. ఈ విపరిణామా లన్నింటినీ అంతర్జాతీయ సమాజం గమనిస్తోందన్న తెలివిడి కూడా మోదీ ప్రభుత్వానికి లేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు