విశాలాంధ్ర బ్యూరో` తిరుపతి: స్వదేశీ నేవిగేషన్ వ్యవస్థ బలోపేతం దిశగా కీలక అడుగుపడింది. ఇటీవల జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-18 నింగిలోకి తీసుకెళ్లిన ఎన్‌వీఎస్-03 నేవిగేషన్ ఉపగ్రహానికి కక్ష్య పెంపు విన్యాసాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా చేపట్టింది. నిర్దేశిత జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అమెరికా జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఇస్రో సొంతంగా నావిక్ వ్యవస్థ కోసం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. గతంలో ప్రయోగించిన కొన్ని ఉపగ్రహాల్‌లో అనేక అణుగడియారాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు, ఎన్‌వీఎస్-02 ప్రయోగం విఫలం కావడంతో నావిక్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ఎన్‌వీఎస్-03 నిర్దేశిత కక్ష్యకు చేరడం విజయంగా భావిస్తున్నారు. దీంతో నేవిగేషన్ సేవల సామర్థ్యం మరింత పెరగనుంది. నావిక్ వ్యవస్థ ద్వారా భారత భూభాగంతోపాటు సరిహద్దుల వెలుపల సుమారు 1500 కిలోమీటర్ల పరిధిలో అత్యంత కచ్చితమైన సమాచార సేవలు అందనున్నాయి. రవాణా, విమానయానం, సముద్ర ప్రయాణాలు, వాహనాల పర్యవేక్షణ, అత్యవసర సేవలు తదితర రంగాల్లో ఈ వ్యవస్థ కీలకంగా ఉపయోగపడనుంది.
నిర్దేశిత కక్ష్యలోకి ఎన్‌వీఎస్-03
- Advertisement -
RELATED ARTICLES


