Homeవిశ్లేషణన్యూయార్క్ బాటలో విజయవాడ

న్యూయార్క్ బాటలో విజయవాడ

- Advertisement -

నగర్ఙాóవృద్ధి అంటే భారీ భవంతులు, ఆకాశ హర్మాయూలు నిర్మించడం కాదు, రహదారులు విస్తరిం చడం, ఫ్లైఓవర్లు కట్టడం, ఆకర్షణీయమైన ఏర్పాట్లు చేయడంతో సరిపోదు. ప్రపంచంలోనే గొప్ప నగర మైన న్యూయార్క్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ గత ఏడాది అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ నగరంలోని వీటికి ఇసుమంత ప్రాధాన్యత కూడా దక్కలేదు. మూడేళ్లలో అక్కడ భారీగా పెరిగిన ఇంటి అద్దెలు పెద్ద చర్చకు దారి తీసింది. ఆ నగరంలో నివసించే సామాన్యుల జీవితాలు ఎంత మెరుగుపడ్డాయి, పేదలకు గౌరవ ప్రదమైన జీవనం లభించిందా, కార్మికులకు ఉపాధి భద్రత ఉందా, పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిందా, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం, ప్రజా రవాణా అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశాలే న్యూయార్క్ మహానగర మేయర్ ఎన్నికల్లో గీటురాళ్లుగా నిలిచాయి. నేటి మన పాలకులు అభివృద్ధి అంటూ భారీ విదేశీ పెట్టుబడులు, వాటి కోసం నిర్వహించే సమ్మిట్లు, రియల్ ఎస్టేట్, భారీ నిర్మాణాలు, వాణిజ్య సముదా యాలు వంటి వాటికి ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ ఈ అభివృద్ధిలో సామాన్య ప్రజల స్థానం ఏమిటనే విషయానికి విలువనివ్వడం లేదు. ఒక నగరంలో నివసించే సామాన్య ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు, పారిశుధ్య కార్మికులు, హమాలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, రైతులకు ఆ నగరం ఎలా భరోసా ఇవ్వాలనే ధ్యాసే పాలకులకు ఉండడం లేదు. సామాన్యులకు ఊరటనివ్వాల్సిన ప్రజా వనరులైన పబ్లిక్ పార్కులు, మార్కెట్‌లు, స్టేడియాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి పూనుకుంటున్నారు.
పిపిపి అనే అందమైన ముసుగు : తాగునీటి సరఫరాతో సహా ముఖ్య మైన పౌర సర్వీసులను పిపిపి అనే అందమైన ముసుగు తొడిగి ప్రైవేటు శక్తులకు కట్టబెట్టడం కోసం జీవో 673, జీవో 74లను కూడా ఇచ్చేశారు. ఇవన్నీ పట్టణ, నగర ప్రజల జీవితాలను నిత్యం ప్రభావితం చేస్తాయి. ఇటు వంటి పనులకు పూనుకుని సంపద సృష్టిలో, నగరాల అభివృద్ధిలో శ్రమ జీవుల పాత్రను గుర్తించరు. ఈ అంశాలను గుర్తించిన జోహ్రాన్ మ్మదానీ న్యూయార్క్ మహానగర మేయర్ ఎన్నికల్లో వాటినే తన ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు. పెరుగుతున్న అద్దెలు, జీవన వ్యయం, ప్రజా రవాణా, వైద్య ఖర్చులు, పిల్లల సంరక్షణ భారంతో సతమతమవుతున్న సామాన్యుల సమస్యలను రాజకీయ చర్చలో కేంద్రస్థానానికి తీసుకొచ్చారు. జనాన్ని తనవైపు తిప్పుకొని ప్రపంచ పెట్టుబడిదారుల స్వర్గంగా పిలువబడే న్యూయార్క్లో అఖండ విజయం సాధించారు. అమెరికాకు న్యూయార్క్ ఎలాంటిదో ఏపీకి బెజవాడ అలాంటిదే. అయితే అక్కడ ఉన్న అన్ని భౌతిక పరిస్థితులు యథాతథంగా మన విజయవాడకు సరిపోకపోవచ్చు. కానీ జోహ్రాన్ మ్మదానీ తన గెలుపు కోసం ఎంచుకున్న అన్ని వర్గాల ప్రజలు మన విజయవాడలోనూ ఉన్నారు. అక్కడి ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడం, సామాజిక అసమానతలను పరిష్కరించడం, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం వంటి అంశాలకు ఇక్కడ కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. విజయవాడకు ప్రత్యేకమైన ఆర్థిక, వాణిజ్య, రవాణా ప్రాధాన్యత ఉంది. రైల్వేలు, రహదారులు, మార్కెట్‌లు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వ్యాపార సంస్థలు నగర వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే నగరంలోని మురికివాడల్లో నివసించే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, మురుగునీటి కాలువలు, విద్యుత్తు, రహదారులు, వీధి దీపాలు, మరుగుదొడ్లు, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వీరి సమస్యలన్నీ తాజా స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ చర్చల్లోకి తేవడం చాలా ముఖ్యం. నగరంలో నివసించే భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, ఆటో డ్రైవర్లు, పారిశుధ్య కార్మికులు, గృహ కార్మికులు, డెలివరీ సిబ్బంది, వీధి వ్యాపారులు నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నారు. అయినా ఈ శ్రమజీవులకు నగర పాలన నుంచి అందే ఫలితాలు దాదాపు మృగ్యంగానే ఉన్నాయి. ఇక సాధారణ, మధ్య తరగతి, ఉద్యోగ వర్గాల ప్రజలు ఎదుర్కొనే సమస్యలేవీ ఇందుకు భిన్నంగా లేవు. భారీగా పెరుగుతున్న ఇంటి అద్దెలు, మోయలేని భారంగా మారిన పిల్లల విద్య, వైద్యం, ప్రయాణం, నిత్యావసర వస్తువుల ధరలు అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచారంలో జోహ్రాన్ మ్మదానీ ఎంచుకున్న అంశాలన్నీ ఇక్కడి పరిస్థితులకు కూడా సరిగ్గా వర్తిస్తాయి. ఈ ఆలోచనలే విజయవాడ మేయర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రస్థానంలోకి రావలసి ఉంది. రాష్ట్రంలోని పాలక, ప్రతిపక్ష పార్టీలే ఈ తాజా ఎన్నికల పోటీలో ఉంటే ఇలాంటి అంశాలకు తావు ఉండేది కాదు. కానీ బెజవాడ ఎన్నికల బరిలోకి వామపక్ష, కాంగ్రెస్ మద్దతుతో ఉన్నత విద్యావంతుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నగర మేయర్ బాధ్యతల కోసం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి రావడంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల చూపు బెజవాడపై పడింది. బెజవాడలో లెఫ్ట్ పార్టీలకు ఉన్న సంస్థాగత బలంతో, కాంగ్రెస్ మద్దతు, నగరంలో బలంగా ఉన్న పౌర సమాజపు మద్దతుతో పాటు ఇతర అనేక రాజకీయ సమీకరణాలు ఏబీవీకి అనుకూలంగా మారుతున్నాయనే చర్చ మొదలైంది. ఒక్కసారిగా విజయవాడ ఏ న్యూయార్క్ అనే స్థాయికి ఈ చర్చ చేరింది. ఇదేదో ఊహల్లో నుంచి వచ్చినది కాదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక వాటిని సరిగ్గా వినియోగించుకోవడమే ఏబీవీ చేయాల్సిన పని.
చిన్న వ్యాపారుల ప్రయోజనాలకు ప్రాధాన్యత అవసరం : పైన పేర్కొన్న అంశాలతో పాటు మరికొన్ని ప్రాధాన్యతలను గుర్తించడమూ చాలా అవసరం. విజయవాడ నగర అభివృద్ధిలో రైతుల ప్రయోజనాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. నగరానికి కూరగాయలు, పండ్లు, ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అందించే చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలతో విజ యవాడకు విడదీయలేని సంబంధం ఉంది. కాబట్టి నగరంలో రైతుబజార్లను మెరుగుపరచడం, పరిశుభ్రమైన మార్కెట్ వసతులు కల్పించడం, రైతులు నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులను విక్రయించే అవకాశాలను విస్తరిం చడం అవసరం. ఈ క్రమంలో అందుకు తగిన రీతిలో నిల్వ, రవాణా సదు పాయాలను మెరుగుపరచాలి. మధ్యవర్తులపై ఆధారపడే పరిస్థితులను తగ్గించి, రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేయాలి. రైతుకు మేలు జరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరడంతో పాటు నగర వినియోగదారులకూ ప్రయోజనం కలుగు తుంది. ఇక నిరుద్యోగ సమస్య తీవ్రమైన ఈ తరుణంలో నగరాన్ని యువ తకు ఉపాధి కేంద్రంగా మార్చే అన్ని అవకాశాలను అన్వేషించడం, చిన్న చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం కూడా నగర ప్రణాళికలో భాగం కావాలి. నైపుణ్య శిక్షణా సంస్థలు, ప్రభుత్వ ఉపాధి విభాగాలు, చిన్న పరిశ్ర మలతో సమన్వయం పెంచాలి. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు చట్టబద్ధమైన వ్యాపార ప్రదేశాలు, పారిశుధ్య సదుపాయాలు, పారదర్శక అనుమతుల విధానం కల్పించాలి. పెద్ద వాణిజ్య సంస్థలకు సౌకర్యాలు కల్పించే పాలకులు చిన్న వ్యాపారుల ప్రయోజనాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడం, ఉచిత మరుగుదొడ్లు, స్థానిక ఆరోగ్య కేంద్రాలకు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల మధ్య సమన్వయం పెంచడం, చెత్త నిర్వహణ, కాలుష్య నియంత్రణకు ప్రాధా న్యత ఇవ్వాలి. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, పిల్లల అవసరాలను కూడా నగర ప్రణాళికలో గుర్తించాలి. వీధి దీపాలు, సురక్షితమైన బస్షెల్టర్లు, ఆటస్థలాలు, గ్రంథాలయాలు, సురక్షితమైన పాఠశాల పరిసరాలు కల్పించాలి. భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు నేర్పిన పాఠాలను విస్మరిం చడానికి వీల్లేదు. వరద ముప్పు, లోతట్టు ప్రాంతాల సంరక్షణ, మురుగునీటి పారుదల వంటి కీలకమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది. సామాన్య జనం కోరుకునే ఈ అంశాలన్నింటినీ తాజా రాజకీయ చర్చలోకి తీసుకురాగలిగితే, ప్రజల ప్రయోజనాలకు విలువనివ్వని వారి ఆశలు తలకిందులయ్యేలా, మేయర్‌గా జోహ్రాన్ మ్మదానీ విజయం సాధించినట్టే, ఎ బెటర్ విజయవాడ నినాదంతో న్యూయార్క్ తరహాలో బెజవాడలోనూ ఒక నూతన ఒరవడిని సృష్టించడం సాధ్యమే. ఫ్రీలాన్సర్, సెల్ : 9059837847

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు