న్యూఢిల్లీ: విమాన ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంతో పాటు విమానయాన పరిశ్రమలో భారత్ సాధిస్తున్న నాయకత్వానికి తోడ్పడేందుకు జిఈ ఏరోస్పేస్ ఒక కీలక ప్రకటన చేసింది. 2025 నుండి 2030 నాటికి దేశీయ సరఫరాదారులపై చేసే వ్యయాన్ని దాదాపు రెట్టింపు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వాణిజ్య విమానయానం, రక్షణ, తయారీ, ఇంజనీరింగ్ రంగాలలో గత నాలుగు దశాబ్దాలుగా భారత్‌లో జిఈ ఏరోస్పేస్ చూపిన ప్రభావాన్ని ఎర్నస్ట్ అండ్ యంగ్ (ఈవై) సంస్థ సమగ్రంగా మదింపు చేసింది. ‘పవరింగ్ ప్రోగ్రెస్: జిఈ ఏరోస్పేస్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ నూతన నివేదికను రూపొందించింది. జిఈ ఏరోస్పేస్ నిర్వహించిన ప్రముఖ పరిశ్రమల అధిపతుల సమావేశం ‘ఇండియా టేకింగ్ ఫె్లట్ ృ ఏవియేషన్, ఇన్నోవేషన్ అండ్ ది రోడ్ టు వికసిత్ భారత్ 2047’ వేదికగా ఈ నివేదికను విడుదల చేశారు. భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగ బలాన్ని ప్రతిబింబిస్తూ, 2025`26 ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై26) దేశీయ వాణిజ్య విమానయాన సంస్థలు సుమారు 19 బిలియన్ అమెరికన్ డాలర్ల రాబడిని సాధించాయి. అత్యాధునిక ఇంజిన్ సాంకేతికత, అత్యున్నత స్థాయి విశ్వసనీయత మరియు కార్యాచరణ సామర్థ్యం ద్వారా జిఈ ఏరోస్పేస్ విమాన అనుసంధానతను, పనితీరును పెంచుతోంది. ఈ విమానయాన వ్యవస్థ ద్వారా ప్రత్యక్షంగా సుమారు 3.70 లక్షల ఉద్యోగాలకు మద్దతు లభిస్తోంది. ఈ నివేదిక ప్రకారం, డిసెంబర్ 2025 నాటికి భారత్‌లో నడుస్తున్న మెజారిటీ వాణిజ్య విమానాలకు జిఈ ఏరోస్పేస్, దాని భాగస్వామ్య సంస్థలు తయారు చేసిన వాణిజ్య ఇంజిన్లే శక్తినిస్తున్నాయి. ప్రస్తుతం 1,400 కంటే ఎక్కువ ఇంజిన్లు సేవలు అందిస్తున్నాయి.


