Sunday, July 20, 2025
Homeవిశ్లేషణప్రభుత్వాన్ని మార్చి…బీహార్‌ని కాపాడండి

ప్రభుత్వాన్ని మార్చి…బీహార్‌ని కాపాడండి

డి.రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి

2024 లోక్‌సభ ఎన్నికల కోసం తయారుచేసిన ఓటర్ల జాబితా ఆధారంగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల కమిషన్‌ నిర్వహించాలి. 18 సంవత్సరాలు నిండిన వారి పేర్లు మాత్రమే ఓటర్ల జాబితాలో చేర్చాలి. ఎందుకంటే ఒకటి లేదా రెండు నెలల స్వల్ప వ్యవధిలో పూర్తిగా కొత్త ఓటర్ల జాబితాను తయారు చేయాలనే ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదన అసాధ్యమైనది. ఈ చర్య వల్ల పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన ఓటర్లు ఓటుహక్కును కోల్పోతారు.

‘‘బీహార్‌ బంద్‌ విజయవంతం చేసినందుకు బీహార్‌ ప్రజలను అభినందిస్తున్నాను’’. మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ఓటర్ల జాబితా సవరణను ఆపివేయాలని వ్యతిరేకంగా జులై 9 న బీహార్‌లో నిర్వహించిన బంద్‌లో భాగంగా పట్నాలో జరిగిన కార్యక్రమంలో మహాఘట బంధన్‌ నాయకులతో కలిసి పాల్గొన్నాను. మోదీ ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక చర్యలను ఎలుగెత్తిచాటుతూ ఈ బంద్‌ నిర్వహించారు. బీహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ఇదే విధమైన విధానాలు అనుసరించడంపై ప్రజాగ్రహం వ్యక్తమైంది. బీహార్‌లో ‘‘ప్రభుత్వాన్ని మార్చండి…బీహార్‌ని కాపాడండి’’ నినాదంతో సీపీఐ పనిచేస్తోంది. నితీశ్‌ కుమార్‌ని తొలగించి తేజస్వీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బంద్‌లో పాల్గొన్న మహా ఘట బంధన్‌ కార్యకర్తలు ముక్తకంఠంతో నినదించారు. తేజస్వీ యాదవ్‌ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగం ఇతర సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశాభావంతో ఉన్నారు. పట్నాలోని గోలంబార్‌ ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం నుంచి ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వరకు మార్చ్‌ నిర్వహించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ, బీహార్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌, సీపీఐ ఎంఎల్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, వీఐపీ కన్వీనర్‌ ముఖేశ్‌ సహాని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ్‌నరేష్‌ పాండే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి లలన్‌ చౌదురి ఇతర నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం తయారుచేసిన ఓటర్ల జాబితా ఆధారంగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల కమిషన్‌ నిర్వహించాలి. 18 సంవత్సరాలు నిండిన వారి పేర్లు మాత్రమే ఓటర్ల జాబితాలో చేర్చాలి. ఎందుకంటే ఒకటి లేదా రెండు నెలల స్వల్ప వ్యవధిలో పూర్తిగా కొత్త ఓటర్ల జాబితాను తయారు చేయాలనే ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదన అసాధ్యమైనది. ఈ చర్య వల్ల పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన ఓటర్లు ఓటుహక్కును కోల్పోతారు. మోదీ ప్రభుత్వ ఆదేశం మేరకు, భారత ఎన్నికల సంఘం బీహార్‌కు చెందిన వలస కార్మికులు, పేదలు, సాధారణ ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి హిట్లర్‌ తరహా చర్యను కుట్రపూరితంగా తీసుకుంటోంది. 2025 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పేదలు, దళితులు, అణగారిన వర్గాలు, వలస కార్మికులు, మైనారిటీల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తుడిచివేయడానికి ప్రమాదకరమైన, అప్రజాస్వామిక ప్రయత్నం జరిగింది. ప్రత్యేక ఇంటెన్సివ్‌ సవరణ అంటే ఓటు నిషేధం. మేము దీనిని ఎట్టిపరిస్థితులలోనూ అంగీకరించం. భారత కమ్యూనిస్టు పార్టీ, మహా కూటమిలోని పార్టీలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి బీహార్‌ నిలుస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బీహార్‌ బంద్‌ సంపూర్ణంగా విజయవంతమైంది. బీహార్‌ బంద్‌ విజయవంతం చేసినందుకు బీహార్‌ ప్రజలను అభినందిస్తున్నాను. బంద్‌లో లక్షలాది మంది పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక బంద్‌ ద్వారా బీహార్‌లో నితీశ్‌ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించి, ప్రజలకు అనుకూలమైన మహా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్న సంకేతాన్ని ప్రజలు ఇచ్చారు. ర్యాలీ అగ్రభాగాన నడిచిన నాయకుల బృందానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ్‌నరేశ్‌ పాండే నేతృత్వం వహించారు. సీపీఐ కార్యకర్తలు, సీపీఐ అధికార పత్రిక జనశక్తి జర్నలిస్టులు వివిధ మార్గాల ద్వారా ఆదాయపన్ను శాఖ కార్యాలయం వద్దకు చేరుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రాంబాబు కుమార్‌, సంజయ్‌ కుమార్‌, పాట్నా జిల్లా కార్యదర్శి విశ్వజిత్‌ కుమార్‌తోపాటు వందలాది మంది సీపీఐ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు