కోల్‌కతా: బందన్ బ్యాంక్ తన 202627 ఆర్థిక సంవత్సరం రెండవ తైమాసిక (క్యూ2) ఫలితాలను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే బ్యాంక్ మొత్తం వ్యాపారం 11 శాతానికి పైగా వృద్ధి చెంది, రూ. 3.3 లక్ష కోట్ల మార్క్‌ను దాటింది. బ్యాంక్ మొత్తం డిపాజిట్లలో రిటైల్ వాటా ప్రస్తుతం దాదాపు 73 శాతంగా ఉంది. విస్తరించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, మెరుగైన ఆపరేటింగ్ సామర్థ్యం, నైపుణ్యం కోసం నిరంతర కృషి ఫలితంగా 202627 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యాపార వృద్ధి సాధ్యమైంది. క్యూ2 ఎఫ్వై27లో బ్యాంక్ ఆర్జించిన నికర లాభం రూ. 622 కోట్లుగా నమోదైంది. భారత్‌లోని 36 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో 35 చోట్ల విస్తరించిన 6,400కి పైగా బ్యాంకింగ్ అవుట్లెట్ల ద్వారా బందన్ బ్యాంక్ ప్రస్తుతం సుమారు 3.2 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ఈ బ్యాంకులో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 75,000 మందికి పైగా ఉంది. క్యూ2 ఎఫ్వై2627లో బ్యాంకు డిపాజిట్ బేస్ గత ఏడాదితో పోలిస్తే 9 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో మొత్తం డిపాజిట్ల విలువ రూ. 1.73 లక్ష కోట్లకు చేరింది. ఇదే కాలంలో మొత్తం అడ్వాన్సులు (రుణాలు) రూ. 1.58 లక్ష కోట్లకు చేరుకున్నాయి. కరెంట్ అకౌంట్ , సేవింగ్స్ అకౌంట్ (కాసా) నిష్పత్తి 26.7 శాతంగా ఉంది. ఇక ఆర్థిక స్థిరత్వానికి ముఖ్యమైన సూచిక అయిన బ్యాంకు క్యాపిటల్ అడిక్వెసీ రేషియో (సీఏఆర్) 18.3 శాతంగా నమోదైంది. ఇది నిబంధనల ప్రకారం ఉండాల్సిన దానికంటే చాలా పటిష్టమైన స్థితిలో ఉందని ఎండీ, సీఈఓ పారœ ప్రతిమ్ సేన్ గుప్తా తెలిపారు. రిటైల్ పోర్ట్‌ఫోలియోను వృద్ధి చేయడంపై వ్యూహాత్మక ప్రాధాన్యతనిస్తూ, బ్యాంక్ తన అసెట్ బేస్‌ను వైవిధ్యపరచడంపై దృష్టి పెట్టింది.
బందన్ బ్యాంక్ క్యూ2 ఎఫ్వై2627 ఆర్థిక ఫలితాలు
- Advertisement -


