Wednesday, February 18, 2026
Homeఅంతర్జాతీయంమదురోను విడుదల చేయాలి

మదురోను విడుదల చేయాలి

- Advertisement -

అమెరికాకు వ్యతిరేకంగా రష్యా, వెనిజులాలో నిరసనలు

మాస్కో/కారకస్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను నిర్బంధించి నెలరోజులు గడిచినా వారిని విడుదల చేయకపోవడంతో అమెరికాపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మదురో దంపతులను తక్షణమే విడుదల చేయాలని వెనిజులాతో పాటు రష్యాలోనూ పౌరులు వీధుల్లోకి వచ్చి భారీ ప్రదర్శనలు నిర్వహించారు. రష్యా రాజధాని మాస్కోలో వెనిజులా రాయబార కార్యాలయం సమీపంలో నిరసన చేపట్టారు. వెనిజులాపై చేసి దాడిని వారు తీవ్రంగా ఖండించారు. రష్యా కమ్యూనిస్టు పార్టీ సహకారంతో వెనిజులాకు సంఘీభావం తెలిపింది. వెనిజులా రాజధాని కారకాస్ సహా అనేక నగరాల్లో జాగారం ద్వారా వినూత్న నిరసన తెలిపారు. ప్లకార్డులతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని డిమాండ్ చేయడంతో పాటు బలీవియన్ విప్లవానికి తమ ధృడమైన మద్దతు పునరుద్ఘాటించారు. వెనిజులాపై సాయుధ దురాక్రమణ, అధ్యక్ష దంపతుల నిర్బంధానికి వ్యతిరేకంగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా (పీఎస్‌యూవీ, స్పానిష్‌లో) ప్రధాన కార్యదర్శి డియోస్డాడో కాబెల్లో తెలిపారు. కారకాస్‌లో, అల్టాగ్రాసియా పారిష్‌లోని ఉర్దనేటా అవెన్యూలో లైవ్ మ్యూజిక్‌ను నిర్వహించారు. సార్వభౌమాధికారం, స్వాతంత్య్రానికి మద్దతు ఇస్తున్నామని, అంతర్గత వ్యవహారాల్లో అమెరికా సామ్రాజ్యవాద జోక్యాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు