Homeవ్యాపారంమొట్టమొదటి “హ్యుందాయ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026” విజయవంతం

మొట్టమొదటి “హ్యుందాయ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026” విజయవంతం

- Advertisement -

గురుగ్రామ్: భవిష్యత్ మొబిలిటీకి రూపకల్పన చేసేందుకు భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతులైన ఆవిష్కర్తలను గుర్తించి, వారితో కలిసి పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్న తన ప్రతిష్టాత్మక స్టార్టప్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అయిన హ్యుందాయ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026ను హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) ఈరోజు విజయవంతంగా ముగించింది. ఈ కార్యక్రమానికి హ్యుందాయ్ మోటార్ గ్రూప్ గ్లోబల్ ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్ జీరోవన్ మద్దతు ఇచ్చింది. భారతదేశం మొబిలిటీ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు కంపెనీ చేస్తున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ముందడుగుగా, హ్యుందాయ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026 తొలి ఎడిషన్ కింద దేశవ్యాప్తంగా అందిన 980 దరఖాస్తుల నుండి హెచ్‌ఎంఐఎల్ 16 ప్రతిభావంతులైన స్టార్టప్‌లను షార్ట్లిస్ట్ చేసింది. అనేక రౌండ్ల మూల్యాంకనం, మార్గదర్శకత్వం, వ్యాపార సమీక్షల ద్వారా ముందుకు సాగిన తర్వాత, షార్ట్లిస్ట్ చేయబడిన స్టార్టప్‌లు అక్టోబర్ 29, 2026న జరిగిన గ్రాండ్ పిచ్ డే సందర్భంగా హెచ్‌ఎంఐఎల్, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్‌ఎంఐఈ) నాయకత్వ బృందాలకు తమ పరిష్కారాలను సమర్పించాయి. హెచ్‌ఎంఐఎల్ ఎండీ, సీఈఓ అయిన తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, స్థాపిత పరిశ్రమ నాయకులు, వినూత్న స్టార్ట్‌అప్‌ల మధ్య సహకారంతోనే భవిష్యత్ మొబిలిటీ ముందుకు సాగుతుందనే మా నమ్మకాన్ని హ్యుందాయ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026 ప్రతిబింబిస్తుందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు