Homeసంపాదకీయంమోహన్ భగవత్ దిగజారుడుతనం

మోహన్ భగవత్ దిగజారుడుతనం

- Advertisement -

ఆర్.ఎస్.ఎస్. అధినేతగా ఎవరున్నా ఆ సంస్థ వ్యవస్థాపక దినమైన దసరా రోజు సర్ సంఘ్ చాలక్ ఉపన్యాసంలో ఏం చెప్తారు అని నిశితంగా పరిశీలిస్తుంటారు. తమది సాంస్కృతిక సంస్థ మాత్రమేనని, రాజకీయాలతో తమకు సంబంధం లేదని చెప్పుకోవడంలో ఆర్.ఎస్.ఎస్. ఎన్నడూ అలసిపోదు. కానీ ఆర్.ఎస్.ఎస్. వ్యవస్థాపక దినోత్సవం రోజున ఆ సంస్థ అధి నేతల ప్రసంగాలు ఎన్నడైనా రాజకీయాలను ప్రస్తావించ కుండా సాగనే లేదు. మోహన్ భగవత్ మంగళవారం చేసిన ప్రసంగం ప్రధానంగా రాజకీయ ప్రసంగమే. ఇటీవల ఒక పత్రికా సమావేశంలో ప్రసిద్ధ న్యాయవాది, సామాజిక కార్యకర్త “పరిపాలన మార్పు” గురించి ప్రస్తావించారు. అంతే ఆర్.ఎస్.ఎస్. కు పనసకాయ దొరికినట్టు అయింది. ప్రభుత్వ మార్పు అన్న మాటను వక్రీకరించి ప్రభుత్వాన్ని పడదోయడం అని బీజేపీ నాయ కులు భాష్యాలు చెప్పడం మొదలుపెట్టారు. మోహన్ భగవత్ కూడా తన దసరా ప్రసంగంలో అదే వక్రీకరణ ఆధారంగా మాట్లా డారు. ఆర్.ఎస్.ఎస్. ఏర్పడి 101 సంవత్సరాలు పూర్త య్యాయి. ఆయన అంతర్జాతీయంగా జరుగుతున్న ఆందోళనల గురించి కూడా మాట్లా డారు. మన దేశంలో జులై ఇరవై నుంచి, నికరంగా చెప్పాలంటే అక్టోబర్ రెండవ తేదీ నుంచి జరుగుతున్న ఆందోళనలను సైతం ప్రస్తావించారు. కానీ ఆయన ప్రసంగం దృష్టి ప్రధానంగా “ప్రభుత్వ మార్పు” అన్న అంశం చుట్టే తిరిగింది. ప్రశాంత్ భూషణ్ ఈ మాట అన్న తరవాత కాంగ్రెస్ అధికార ప్రజా సంబంధాల విభాగానికి చెందిన పవన్ ఖేరా కూడా ఇదే మాట మాట్లాడారు. ప్రతిపక్షాలు ప్రశాంత్ భూషణ్ అన్న మాటను సమర్థించాయి. ప్రభుత్వ మార్పు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైన అంశమే కాదు. సహజమైన విషయం కూడా. కానీ బీజేపీ “ప్రవక్తలు”, ఆర్.ఎస్.ఎస్. అధినేతను దీన్ని ప్రభుత్వాన్ని పడదోయడంగా చిత్రిం చారు. మోహన్ భగవత్ ప్రసంగం అంతా ప్రభుత్వాన్ని పడదోయ డాన్ని వ్యతిరేకించడంతోనే సరిపోయింది. ప్రభుత్వ మార్పు అంటే ప్రభుత్వాన్ని పడదోయడం అన్న అర్థం ప్రతిపక్షాల మాటల్లో ఎక్కడా దొర్లలేదు. ప్రభుత్వాన్ని పడ దోయడం అంటే ఆర్.ఎస్.ఎస్.కు తెలిసింది బలప్రయోగం ద్వారా ప్రభుత్వాన్ని మార్చడమే కాబోలు. కానీ ప్రతిపక్షాల ఉద్దేశం అది కానే కాదు. అయితే బీజేపీ, సంఘ్ పరివార్ ప్రచార పద్ధతే భిన్నంగా ఉంటుంది. వాస్తవాన్ని వక్రీకరించడంలో సంఘ్ పరివార్ దిట్ట. 1975లో ఎమర్జెన్సీ విధిం చిన తరవాత ఆర్.ఎస్.ఎస్.ను నిషేధించారు. అయినా అజ్ఞాతంగా ఆర్.ఎస్.ఎస్. కార్యకలాపాలు కొనసాగుతూనే వచ్చాయి. లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ నడిపిన సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో ఆర్.ఎస్.ఎస్. ప్రధాన పాత్రే పోషించింది. ఆర్.ఎస్.ఎస్.కు పూర్వ రూపమైన భారతీయ జన సంఘ్ కూడా ఇదే పని చేసింది. ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా కొనసాగిన ఉద్యమం వల్లే 1977 ఎన్నికల్లో మొట్టమొదటిసారి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైంది. ఇందిరాగాంధీ పదవి కోల్పోవలసి వచ్చింది. ఆ తరవాత 2011 నుంచి మొదలైన అవి నీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమం నడిపారు. ఆ ఉద్య మానికి పదాతి దళాన్ని సమకూర్చింది ఆర్.ఎస్.ఎస్. అని మరిచి పోలేం. అంటే ప్రభుత్వ మార్పులో ఆర్.ఎస్.ఎస్. అనేక సార్లు కీలకమైన భూమికే నిర్వహించింది. ఇప్పుడు అదే మాటను కాళ్లు కీళ్లు విరిచేసి బలవంతంగా ప్రభు త్వాన్ని కూల్చేసే ప్రయత్నం జరుగుతోందని నానా యాగీ చేస్తోంది. మోహన్ భగవత్ ఓట్ చోరీకి విరుద్ధంగా జరుగుతున్న ఉద్యమాన్ని తూర్పార పట్టారు. ఈ విషయంలో ఆయన ఫక్తు బీజేపీ ప్రవక్తలాగే మాట్లాడారు. మోదీ ప్రభుత్వం పడిపోతే పరిస్థితి ఏమిటి అన్న భయం ఆర్.ఎస్.ఎస్.కు ఉండడం సహజమే. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాతే మోహన్ భగవత్‌కు అధికార లాంఛనాల సదు పాయం కలిగింది. ఆయనకు పటిష్టమైన జడ్ ప్లస్ భద్రతా ఏర్పాట్లు జరిగిపోయాయి. ఒక సాంస్కృతిక సంస్థ అధిపతికి ఇంతటి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం మోదీ ప్రభుత్వానికి మాత్రమే చెల్లింది. ఓట్ చోరీ వ్యతిరేక ఉద్యమకారులను అరాచక వాదులుగా ముద్ర వేయడంలో మోహన్ భగవత్ అక్షరాలా బీజేపీ ప్రవక్తల అడుగుజాడ ల్లోనే నడిచారు. జ్ఞానేశ్ కుమార్ ఆగడాలకు వ్యతిరేకంగా విద్యా ర్థులు, యువత, ప్రతిపక్షాలు ఉద్యమించడం వెనక విదేశీ శక్తులు ఉన్నాయని కూడా మోహన్ భగవత్ అచ్చం ఇందిరాగాంధీ మాటలనే వినియోగించు కున్నారు. తాము ఇబ్బందుల్లో పడ్డప్పుడు నెపం విదేశీ శక్తుల మీద నెట్టేయడం ఇందిరాగాంధీ హయాం నుంచి కొనసాగుతున్న సంప్రదాయమే. మోహన్ భగవత్ కూడా అదే దారిలో నడుస్తు న్నారు. ఆర్.ఎస్.ఎస్. అధినేత అసలు మౌలికంగా ఉద్యమాలనే చీదరించుకుంటున్నారు. అంటే ఓట్ చోరీకి వ్యతిరేకంగా ప్రజో ద్యమ కెరటం ఉవ్వెత్తున లేవడంతో మోదీ ప్రభుత్వం భయకంపిత మైనట్టే బీజేపీ మాతృసంస్థను కూడా భయం పీడిస్తున్న ట్టుంది. వచ్చే సంవత్సరారంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, పంజాబ్ రాష్ట్రాలలో శాసనసభల ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక వాతావరణం అలుముకుంటున్నందు వల్ల బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. ఆ భయమే మోహన్ భగవత్ను కూడా ఆవహించింది. మోహన్ భగవత్ ప్రసంగం అంతా మోదీకి లొంగి ఉండే వ్యక్తి మాటల్లాగా కనిపించింది. ఆయన ప్రతి మాటలో మోదీకి లొంగుబాటులా ఉంది. బీజేపీయే సంఘ్ పరివార్‌లో భాగం. అయినా మోహన్ భగవత్ ప్రధాన మంత్రి మోదీకి దాసోహం అయి నట్టుగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా ఏ సంఘ్ అధినేత ఇలా దాసోహం ఐన సందర్భమే స్ఫురణకు రావడం లేదు. ప్రభుత్వాన్ని ఆశీర్వదించే, సంరక్షించే, ముందుకు నడిపించే స్థాయిలో ఉండే సంఘ్ పరివార్ స్థాయిని మోహన్ భగవత్ ఇంతగా ఎందుకు దిగజార్చాల్సి వచ్చిందో తెలి యదు. ఇలాంటి భావన, ప్రవర్తన ఇంతకు ముందు సంఘ్ అధి నేతల్లో ఇదివరకెప్పుడూ ఉండేది కాదు. ఉద్యమాలు, ప్రభుత్వాల మార్పుతో ఒరిగేదీ ఏమీ లేదు అని మోహన్ భగవత్ అనడం బిత్తరపోయేట్టు చేస్తోంది. ప్రభుత్వ మార్పుతో ఏమీ జరగకపోతే భారత్ “విశ్వ గురువు” అయిందని కేంద్ర ప్రభుత్వంతో సహా సంఘ్ ఎందుకు టముకు వేస్తున్నట్టో! ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య విరోధాలు ఉండడం సర్వసాధారణం. ప్రతిపక్షం ఎప్పుడూ అధికార పక్షాన్ని గద్దె దించి అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తుంది. అయితే అది సంఘ్ వక్ర భాష్యం చెప్తున్నట్టుగా ప్రభుత్వాన్ని బల ప్రయోగంతో పడదోయడం కానే కాదు. మార్పు ఎన్నికల ద్వారా రావాలన్నదే ప్రతిపక్షాల వాదన లోని అంతరారœం. ముందుముందు బీజేపీ ప్రతిపక్ష స్థానానికి పరి మితమైపోయినప్పుడూ సరిగ్గా ఇదే భాష మాట్లాడుతుంది. అప్పుడు మడికట్టుకు కూర్చోదుగా! ఉద్యమంలో పాల్గొంటున్న యువతను పిలిచి మాట్లాడింది ఇదే మోహన్ భగవత్ కదా! మోదీ తనను తాను సర్వజ్ఞాన సంపన్నుణ్ణి అనుకుంటారు. అది ఆయన ఇష్టం. ఇప్పుడు మోహన్ భగవత్ కూడా సర్వజ్ఞాన సంపన్నుడైపోయినట్టున్నారు. అందుకే సర్ సంఘ్ చాలక్ స్థాయిని దిగజార్చినట్టున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు