Homeసంపాదకీయంరాహుల్కు తప్పిన రెండు గండాలు

రాహుల్కు తప్పిన రెండు గండాలు

- Advertisement -

శుభాశుభ దినాలు అన్నది కచ్చితంగా మూఢనమ్మకమే. కానీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సోమవారం రెండు మంచి సంకేతాలు అందాయి. ఒకటి : ఆయన వాహనశ్రేణి పెద్ద ప్రమాదానికి గురైంది. కానీ రాహుల్ సురక్షితంగా బయటపడ్డారు. రెండు : అమిత్ షాను హత్యకేసులో నిందితుడు అని రాహుల్ గాంధీ అన్నారని వాదిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుల్తాన్పూర్ కోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని ఓ ఛోటా బీజేపీ నాయకుడు రాహుల్ పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ వ్యవహారంతో అర్జీ పెట్టుకున్న వ్యక్తికి ఎలాంటి సంబంధమూ లేదని కోర్టు వ్యాఖ్యానించింది. పైగా ఆ అర్జీ పెట్టుకున్న వ్యక్తిని తీవ్రంగానే మందలించింది. నవంబర్ ఒకటిన ప్రతిపక్ష ఐక్య సంఘటన దిల్లీలోని రాంలీలా మైదానంలో పది లక్షల మందితో ర్యాలీ నిర్వహించాలని సంకల్పించింది. ఇది మోదీ ప్రభుత్వానికి నిస్సందేహంగా మోదీకి, అమిత్ షాకు పెద్ద సవాలే. ఆ ర్యాలీ జరగడానికి ముందు రాహుల్ గాంధీని సుల్తాన్పూర్ కోర్టు నిర్దోషిగా తేల్చడం, రోడ్డు ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడడం సానుకూల పరిణామాలే. చిన్నా చితకా బీజేపీ నాయకులు దేశంలోని వివిధ న్యాయస్థానాలలో రాహుల్ మీద అనేక కేసులు దాఖలు చేశారు. ఇప్పటిదాకా ఆ కేసుల సంఖ్య 475 అని లెక్క తేలింది. ఒక్క కేసులో రాహుల్ నిర్దోషిగా సోమవారం బయటపడ్డారు. మరో 46 కేసులు వివిధ కోర్టుల్లో తేలాల్సి ఉంది. ఏ రాజకీయ నాయకుడి మీద ఇన్ని కేసులు ఎప్పుడూ ఎక్కడా దాఖలై ఉండవు. మోదీ సర్కారు న్యాయవ్యవస్థను లొంగదీసుకుంది అన్న ఆరోపణలు ఎటూ ఉన్నాయి. ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు, మారుమూల ప్రాంతాలలో రాహుల్ మీద కేసులు దాఖలు చేయడం సైతం మోదీ ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగమే. తన మీద వంద కేసులు దాఖలు కావడం కోసం ఎదురుచూస్తున్నానని రాహుల్ ఛలోక్తి విసురుతున్నారు. దేశంలోని మూలమూలలా కేసులు దాఖలు చేసి రాహుల్ను కోర్టుల చుట్టూ తిప్పాలన్నది బీజేపీ పన్నాగం. ఈ కుట్రను అమలు చేయడం కోసం ఛోటామోటా నాయకులను వినియోగించి కేసులు దాఖలు చేసేట్టు చేయడం బీజేపీ వ్యూహంలో భాగం. అమిత్ షాను రాహుల్‌గాంధీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తి అన్నారు కనక ఈ కేసులో రాహుల్ నిర్దోషిగా బయటపడడం అమిత్ షాపై రాహుల్ సాధించిన విజయంగా భావించాలి. సోహ్రాబుద్దీన్ హత్య కేసులో అమిత్ షాను 2010లో గుజరాత్ నుంచి బహిష్కరించారు. ఆయన గుజరాత్‌లో కాలు పెట్టకుండా చేశారు. సోహ్రాబుద్దీన్, కౌసర్బీ హత్యల కేసులో అప్పుడు అమిత్‌షానే ప్రధాన నిందితుడు. ఆ సందర్భంలో గుజరాత్ హైకోర్టు బెయిలు మంజూర్ చేసినప్పటికీ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమిత్ షా గుజరాత్‌లో ఉంటే సాక్ష±ధారాలను తారుమారు చేయొచ్చునని సుప్రీంకోర్టు భావించి రెండేళ్ల పాటు గుజరాత్‌లో అడుగుపెట్టకూడదని నిర్దేశించింది. 2012లో సుప్రీంకోర్టు మళ్లీ అమిత్ షాకు బెయిలు మంజూర్ చేసి గుజరాత్‌లో అడుగు పెట్టకూడదన్న నిర్దేశాన్ని రద్దు చేసింది. 2014 డిసెంబర్‌లో మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరవాత సీబీఐ ప్రత్యేక కోర్టు అమిత్ షాను పూర్తిగా ఈ కేసు నుంచి విముక్తం చేసింది. అమిత్ షా మీద వచ్చిన ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడినవి అని ఆయన సమర్థకులు అంటుంటారు. కానీ ఆయనను న్యాయస్థానమే గుజరాత్‌లో కాలు పెట్టకుండా చేయడం, కొన్నాళ్ల పాటు ఆయన జైలు శిక్ష అనుభవించడం తోసిపుచ్చడానికి వీలు లేని విషయాలే. రాహుల్ గాంధీ ప్రస్తావించింది సరిగా ఈ వాస్తవాన్నే. ఇలా తలాతోకా లేని కేసుల్లో ప్రత్యర్థులను ఇరికించడం బీజేపీకి బాగా అలవాటైన విద్యే. ప్రశ్నించే వారినే బోనెక్కించడం బీజేపీ నేర్చిన విద్య. సుల్తాన్పూర్ కోర్టు నిర్దోషిగా తేల్చిన తరవాత రాహుల్ గాంధీని ఎన్ని ప్రశ్నలడిగినా సమాధానం చెప్పలేదు. అంటే ఈ కుటిల యత్నాలపై ఆయన వ్యాఖ్యానించదలుచుకున్నట్టు లేదు. రాహుల్ గాంధీ దృష్టి అంతా ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ చేత రాజీనామా చేయించడమే. నవంబర్ ఒకటిన రాం లీలా మైదానంలో ప్రతిపక్షాల ర్యాలీ లక్ష్యం ఇదే. నవంబర్ ఒకటిన తలపెట్టిన రాం లీలా మైదానంలో ర్యాలీ జరగకుండా చేయడానికి మోదీ ప్రభుత్వం ఎత్తని ఎత్తులేదు. అయితే ఈ ర్యాలీ నిర్వహించడానికి ప్రతిపక్షాలకు అనుమతి ఉంది. అయినా రాజకీయంగా ఈ ర్యాలీకి అడ్డు తగలడానికి బీజేపీ సకలవిధ ప్రయత్నాలూ చేయడం మాత్రం మానలేదు. 1984 అక్టోబర్ 31వ తేదీన ఇందిరాగాంధీ హత్య జరిగిందని, ఆ తరవాత సిక్కుల మీద దాడులు జరిగాయి కనక నవంబర్ ఒకటిన ర్యాలీ నిర్వహిస్తే పాత గాయాలను రేపినట్టు అవుతుందట. అంటే అక్టోబర్ 31 పరిసర ప్రాంతాలలో ఎవరూ ఏ కార్యక్రమమూ చేపట్టకుండా ఉంటారా? నవంబర్ ఒకటిన ర్యాలీ నిర్వహించడం సిక్కులను అవమానించడం అని బీజేపీ వితండవాదానికి దిగుతోంది. ఈ ర్యాలీ నిర్వహించకూడదని రాహుల్ మీద ఒత్తిడి తీసుకురావడానికి బీజేపీ తనకు అనుకూలమైన వ్యాపారులనందరినీ కూడగట్టి వారి చేత మీడియా సమావేశం ఏర్పాటు చేయించింది. పండగ సమయంలో ర్యాలీ నిర్వహిస్తే తమ వ్యాపారాలు దెబ్బ తింటాయని వ్యాపారులు అంగలార్చేట్టు చేసింది. నిజానికి లక్షలాది మంది రాం లీలా మైదానం చేరుకుంటే వారు అన్నపానాదులు ఎక్కడ తీసుకుంటారు? ఆ పరిసరాల్లోనే కదా. దీనివల్ల వ్యాపారం పెరుగుతుంది తప్ప దెబ్బతినే అవకాశం ఎక్కడిది? ఇటీవలి కాలంలో నిరసనలు జరిగి నప్పుడు ప్రభుత్వమే రోడ్లన్నింటినీ మూసేసి బంద్ జరిగేట్టు చేసింది. దుకాణాలు మూయించింది. మెట్రో స్టేషన్‌లను మూసేసింది. ఇందులో ఉద్యమకారుల పాత్ర ఎక్కడ ఉంది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేస్తే నవంబర్ ఒకటి నాటి ఆందోళన 30 సెకన్లలో అంతం అవుతుంది అని రాహులు ధీటైన సమాధానం ఇచ్చారు. ఎక్కడ ఆందోళన జరిగినా మోదీ ప్రభుత్వం చుట్టు పక్కల సకల కార్యకలాపాలు స్తంభించేట్టు చేస్తుంది. షాహీన్ బాగ్ ఆందోళనలప్పుడు ఈ పనే చేసింది. నెపం ఆందోళనకారుల మీదకు నెట్టింది. ఆందోళన చేస్తున్న వారి మీద జనం తిరగబడేట్టు చేయడమే కేంద్ర ప్రభుత్వ అసలు లక్ష్యం. ఇది విఫలం కాక తప్పదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు