Homeవిశ్లేషణరైతు గుర్తింపునకు భూరికార్డే కొలమానమా?

రైతు గుర్తింపునకు భూరికార్డే కొలమానమా?

- Advertisement -

చక్రధర్ బుద్ధ

లక్‌కు తూర్పు కనుమల్లో నివసించే ఆదివాసీ రైతు. తండ్రి నుంచి వార సత్వంగా వచ్చిన మూడెకరాల అటవీ భూమిని సాగు చేసుకుంటున్నాడు. అయితే భూ రికార్డులు ఇప్పటికీ తండ్రి పేరు మీదే ఉన్నాయి. అటవీ భూముల మ్యుటేషన్ (పేరు మార్పిడి) పద్ధతిపై స్పష్టత లేకపోవడంతో అవి లక్‌కు పేరు మీదకు మారలేదు. ఆంధ్రప్రదేశ్ గోదావరి ప్రాంతానికి చెందిన మహిళా రైతు లక్ష్మీ, అమెరికాలో ఉండే భూ యజమాని పొలాన్ని కౌలుకు చేస్తోంది. ఆమె శ్రమే ఆ పంటకు జీవం పోస్తున్నా, భూరికార్డుల్లో ఆమె పేరు ఎక్కడా కనిపిం చదు. తెలంగాణలో నారాయణపేట జిల్లాకు చెందిన దళిత రైతు ప్రభు దాస్ది మరో వ్యథ. డిజిటల్ భూ రికార్డుల్లో సాగుదారుల పేర్లకు చోటే లేకపోవడంతో ఆయన పేరు గల్లంతయింది. పొలంలో సాగు చేస్తున్న రైతుకూ, రికార్డులో ఉన్న పేరుకూ మధ్య అంతరాన్ని ఈ అనుభవాలు స్పష్టం చేస్తు న్నాయి. ప్రభుత్వ వ్యవసాయ సేవలకు ఈ రికార్డులనే కొలమానంగా తీసు కుంటే, వాస్తవ సాగుదారులే సాయానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. భూ రికార్డుల్లో పేరు లేకపోవడం అనేది సాగు చేయకపోవడానికి నిదర్శనం ఎంత మాత్రం కాదు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ‘అగ్రిస్టాక్’ ఈ సమస్యను కీలకం చేస్తోంది. రైతులు, వ్యవసాయ భూములు, పంటల సమాచారాన్ని ఒకే తాటి పైకి తెచ్చే డిజిటల్ మౌలిక వ్యవస్థ ఇది. ఇందులో మూడు ప్రధాన భాగాలు న్నాయి. ఆధార్‌తో అనుసంధానించిన ప్రత్యేక గుర్తింపునిచ్చే ‘రైతు రిజిస్ట్రీట్’ ఒకటి. భూ సరిహద్దులను గుర్తించే డిజిటల్ గ్రామ పటాలు రెండోది. ప్రతి సీజన్‌లో ఏ సర్వే నంబరులో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగవుతుందో నమోదు చేసే ‘పంటల రిజిస్ట్రీట్’ మూడోది. 2026 అక్టోబరు 24 నాటికే 11 కోట్ల మంది రైతులు రైతు రిజిస్ట్రీలో నమోదయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమాచారాన్ని అను సంధానించి వ్యవసాయ పథకాలు, సేవలను మరింత సమర్థంగా అందించాల న్నది ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల రైతులు పదేపదే ధృవీకరణ పత్రాలు సమర్పించే భారం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. రుణాలు, బీమా సత్వరం లభిస్తా యని, విపత్తు సాయం వేగంగా అందుతుందని అంటోంది. పంట కొనుగోళ్లు పారదర్శకంగా జరిగి నకిలీలు, మోసాలు తగ్గు తాయన్నది మరో వాదన. ఇవి రైతులకు అవసరమైన ప్రయోజనాలే. కానీ నమోదు ఇంత వేగంగా జరుగుతు న్నప్పుడు, అందులో ఎవరికి చోటు దక్‌కు తోంది, ఎవరు మిగిలిపోతున్నారు అన్న ప్రశ్నలను వాయిదా వేయలేం. అగ్రి స్టాక్‌లో రైతు రిజిస్ట్రీట్‌కి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పీఎం కిసాన్ వంటి పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఇందులో నమో దును తప్పనిసరి చేశారు. అందు వల్ల రిజిస్ట్రీలో ఎవరికి గుర్తింపు లభిస్తుం దన్నది ప్రభుత్వ సాయం ఎవరికి అందుతుందో నిర్ణయించే అంశంగా మారు తోంది. అగ్రిస్టాక్ సరికొత్తగా కని పిస్తున్నప్పటికీ, దానికి పునాది అయిన భూ రికార్డుల కంప్యూటరీకరణ దశా బ్దాలుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ‘మీభూమి’, తెలంగాణలో ‘ధరణి’ ఆ క్రమంలో వచ్చినవే. 2024 సెప్టెంబరులో ‘డిజిటల్ అగ్రికల్చర్ మిషన్’కు ఆమోదం లభించడంతో అగ్రిస్టాక్‌కు ఊపొచ్చింది. అయితే పెండింగ్‌లో ఉన్న పేరు మార్పిడులు, నమోదు కాని కౌలు సాగు, సరిహద్దు వివాదాలు, తప్పుడు సర్వే నంబర్లు వంటి పాత సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. కాగితపు రికార్డులకూ, డిజిటల్ రికార్డులకూ మధ్య తేడాలూ మిగిలే ఉన్నాయి. ఒక రికార్డును కంప్యూటర్లోకి ఎక్కించినంత మాత్రాన అది కచ్చితమైనదని, సమగ్ర మైనదని, అందరి హక్కులనూ ప్రతిబింబిస్తోందని భావించలేం. లక్ష్మీ వంటి కౌలుదారుల విషయమే తీసుకుందాం. రైతు రిజిస్ట్రీట్ అప్లికేషన్‌లో కౌలు దారుల నమోదుకు అవకాశం ఉందని, వారి చేరికను రాష్ట్ర విధానమే నిర’ యిస్తుందని కేంద్రం చెబుతోంది. కానీ కౌలుదారులను రికార్డులకు దూరంగా ఉంచిన సామాజిక, పరిపాలనాపరమైన అడ్డంకులు కేవలం సాంకేతిక ఏర్పాటుతో తొలగిపోవు. అలాగే అటవీ భూముల పేరు మార్పిడి ప్రక్రియపై స్పష్టత లేకుండా, వారసత్వంగా సాగుచేస్తున్న లక్‌కు వంటి రైతులకు గుర్తింపు కల్పిం చడం కష్టమే. నమోదుకు అవకాశం ఉండటంతో పాటు, వాస్తవ సాగుదారులు అందులో చేరగలిగే పరిస్థితులూ ఉండాలి. కుటుంబంలో వ్యవసాయం చేస్తున్న మహిళల గుర్తింపు కూడా కీలకం. భూమి భర్త పేరు మీద ఉంటే, అదే భూమిలో సాగు చేస్తున్న భార్యకు స్వతంత్ర రైతు గుర్తింపు ఎలా లభిస్తుంది ? భార్యాభర్తల ఉమ్మడి పేర్లతో ఉన్న అటవీ హక్కుల పట్టా నుంచి నమోదులో ఒక్కరి పేరునే తీసుకుంటే, ఎవరిని ఎంచుకుంటారన్నది కీలకమవుతుంది. ఆ ఎంపిక పురుషుడి వైపు మొగ్గితే, పట్టాలో ఉన్న మహిళ హక్కు డిజిటల్ వ్యవ స్థలో కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. ఉమ్మడి హక్కులను ఒక్క వ్యక్తి గుర్తింపుగా కుదించకుండా చూడాలి. రికార్డుల్లోని తప్పులు అనేక సేవలకు అడ్డంకిగా మారొచ్చు. ఆధార్‌లోని పేరుకూ, భూ`రికార్డులోని పేరుకూ చిన్న తేడా ఉన్నా నమోదులో ఇబ్బంది ఎదురవచ్చు. మూడు ఎకరాల్లో సాగుచేస్తున్న రైతుకు డిజిటల్ రికార్డులో రెండు ఎకరాలే నమోదై ఉన్నాయనుకుందాం. ఎరువుల కేటాయింపునకైనా, రుణ పరిమితికైనా ఆ విస్తీర్ణాన్నే ప్రామాణికంగా తీసుకుంటే రైతు నష్టపోతాడు. విభిన్న ప్రభుత్వ విభాగాలు ఒకే సమాచారంపై ఆధారపడినప్పుడు, ఒక్క రికార్డులో దొర్లిన తప్పు అనేక సేవలను ప్రభావితం చేస్తుంది. ఆ తప్పును ఏ శాఖ సరిదిద్దాలి, ఏ ఆధారాలు చూపాలి, సవరణ సంబంధిత శాఖలన్నింటిలోనూ అమలైందో లేదో తెలుసు కోవడం రైతుకు పెనుభారంగా మారుతుంది. ఈ సమస్యలు సేవల నమోదుకే పరిమితం కావు. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న సాగు, భూ హక్కులు అధికారికంగా రద్దు కాకుండానే ఆచరణలో బలహీనపడవచ్చు. పాత రికార్డుల్లోని గుర్తింపు లకు కొత్త వ్యవస్థలో చోటు దక్కకపోవడం అందుకు ఒక మార్గం. ప్రభుదాస్ పేరు డిజిటల్ రికార్డుల్లో గల్లంతవ్వడమే దీనికి ఉదాహరణ. ఇప్పటికే ప్రభుత్వ గుర్తింపు ఉన్న హక్కులను రైతులు మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ వచ్చు. 2015-16 వ్యవసాయ గణన ప్రకారం దేశంలోని కమతాల్లో దాదాపు 86 శాతం రెండు హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చిన్న, సన్నకారు కమ తాలే. సాగుహక్కులకు భరోసా లేక పోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, అప్పులు, అరకొర నీటిపారుదల, అనిశ్చిత రాబడులు ఈ సాగుదారులను వేధిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు, ప్రజాధన పెట్టుబడులు వారి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అగ్రిస్టాక్‌పై పెట్టుబడులు ఈ సమస్యల పరిష్కారానికి ఎలా తోడ్పడతాయో స్పష్టత అవ సరం. మెరుగైన సమాచారం కొంత తోడ్పడవచ్చు. కానీ సాగు హక్కులకు భరోసా, అవసరమైన సేవలు, గిట్టుబాటు ధరలకు అది ప్రత్యామ్నాయం కాదు. సామాజిక అసమానతలను కేవలం ‘సమాచార లోపాలు’గా చూసి పరిష్కరించలేం. వాస్తవ సాగు సంబంధాలను గుర్తించని వ్యవస్థ ఆ అసమానతలను బలపరచవచ్చు. సాంకేతికత పై చర్చ తరచూ ‘మంచిదా, చెడ్డదా’ అనే రెండు ధృవాల మధ్య చిక్కుకు పోతోంది. ఇక్కడ అడగాల్సిన ప్రశ్నలు వేరు. ఈ వ్యవస్థ ఎవరి పరిస్థితులను గుర్తిస్తోంది? ఎవరి పై భారం మోపుతోంది? దాని విని యోగాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు? నిర’ యాలను సవాలు చేసే అవకాశం ఎవరికి ఉంది? అగ్రిస్టాక్ ఫ్రేమ్ వర్స్క్కపై ప్రజలు, నిపుణుల అభిప్రాయాలను ఆహ్వానించినట్లు చెబుతున్నా, చిన్న రైతులు, కౌలుదారులు, మహిళలు, ఆది వాసీ సమాజాలతో అర్థవంతమైన సంప్రదింపులు జరిగినట్లు దాఖలాలు కనిపించడం లేదు. వారి అనుభవాలు రూపకల్పనలో భాగం కావాలి. పౌరసమాజం, రైతుసంఘాలు కూడా ప్రయోజ నాలు నిలిచిపోయినప్పుడు స్పందించడానికే పరిమితం కాకుండా, రూపకల్పన దశ నుంచే విధానపరమైన జోక్యం చేసుకోవాలి. అగ్రిస్టాక్ అమలులో కొన్ని కనీస రక్షణలు అవసరం. మొదటిది, సాంకేతిక కారణాలతో నమోదు విఫల మైనా, రికార్డులపై వివాదాలు ఉన్నా రైతులకు అందే వ్యవసాయ సాయం నిలిచిపోకూడదు. సమస్య పరిష్కార మయ్యే వరకు ప్రత్యామ్నాయ ధృవీకరణతో సాయం పొందే అవకాశం ఉండాలి. రెండోది, భూయాజమాన్యంతో నిమిత్తం లేకుండా వాస్తవ సాగుదారులకు గుర్తింపు ఇవ్వాలి. కౌలుదారుల నమోదుకు ఉన్న అడ్డంకులను తొలగించాలి. అటవీ హక్కుల పట్టాదారుల వారసులకు పేరు మార్పిడి, రైతు నమోదుకు స్పష్టమైన ప్రక్రియ ఉండాలి. వ్యవసాయం చేస్తున్న మహిళలకు స్వతంత్ర రైతు గుర్తింపు లభించాలి. ఉమ్మడి పట్టాల్లోని మహిళల హక్కులు, సామూహిక అటవీ హక్కులు డిజిటల్ నమోదులోనూ ప్రతిబింబించాలి. మూడోది, రికార్డులను గ్రామస్థాయిలో సరిచూసి, తప్పులను సరిదిద్దే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగమే తీసుకోవాలి. ఫిర్యాదులకు నిర్ణీత సమయంలో పరిష్కారం, నిర్ణయం పై అప్పీల్ చేసే అవకాశం ఉండాలి. ఒక శాఖలో చేసిన సవరణ సంబంధిత శాఖల రికార్డుల్లోనూ అమలుకావాలి. పత్రాల భారం తగ్గించాల్సిన వ్యవస్థ, తప్పుల సవరణ కోసం రైతును కార్యాల యాల చుట్టూ తిప్పకూడదు. లక్‌కు, లక్ష్మీ, ప్రభు దాస్ ఇప్పటికే నేలను నమ్ము కుని సాగు చేస్తున్నారు. అగ్రిస్టాక్ అయినా, మరే సాంకేతికత అయినా రైతుల అవసరాలను ఎంత మేరకు తీర్చింది, సాధించుకున్న హక్కులను ఎంత పరి రక్షించింది, ప్రభుత్వ సాయాన్ని పొందడం ఎంత సులభతరం చేసిందనేదే దాని విజయానికి కొలమానం కావాలి. “దేశానికి రైతే వెన్నెముక” అన్న మాట కేవలం నినాదంగా మిగిలిపోకూడదు. భూరికార్డులో పేరు ఉన్నా లేకున్నా, వాస్తవ సాగుదారులకు గుర్తింపు, సాయం అందినప్పుడే ఆ మాటకు అర్థం ఉంటుంది. సీనియర్ పరిశోధకులు లిబ్టెక్ ఇండియా

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు